గాసిప్స్ : “పుష్ప” కోసం అప్పుడు సమంత.. ఇప్పుడు?

ఈ ఒక్క ఏడాదిలోనే టాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి రాబోతున్న బిగ్గెస్ట్ చిత్రాల్లో అయితే బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాల సీక్వెల్స్ తర్వాత మళ్ళీ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రం “పుష్ప 2” కూడా ఒకటి. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ నే “పుష్ప 2” కాగా దీనిని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.

ఇక పాన్ ఇండియా మార్కెట్ లో అయితే అల్లు అర్జున్ పేరు మీదనే భారీ ఫేమ్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటి భాగంలో ఉన్న ఎన్నో మేజర్ హైలైట్స్ లో ఐటెం సాంగ్ ఓ అంటావా సాంగ్ కూడా ఒకటి. పలు కాంట్రవర్సీ ల తర్వాత సమంత రెచ్చిపోయి చేసిన ఈ సాంగ్ అన్ని భాషల్లోని హిట్ అయ్యింది.

దీనితో పార్ట్ 2 లో కూడా దానిని మించిన స్పెషల్ సాంగ్ ని దేవిశ్రీ ప్రసాద్ ఇస్తున్నట్టుగా ఇప్పటికే టాక్ ఉంది. ఇక అల్లు అర్జున్, సుకుమార్, దేవిలా కాంబినేషన్ లో ఐటెం సాంగ్ అంటే అదొక ట్రెండ్ అందుకే ఈ సాంగ్ మరింత స్పెషల్ గా మారగా ఈసారి సమంతని ఐతే ఓయ్ యంగ్ బ్యూటీ రీప్లేస్ చేస్తుంది అంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఆమె ఎవరో కూడా కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల అంట. ఆమెనే ఈసారి తమ ఐటెం గర్ల్ గా మేకర్స్ ఎంచుకున్నారని సౌత్ సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ ఊహించని రూమర్స్ ఎంతవరకు నిజం అవుతాయి అనేది మాత్రం ఆగి చూడక తప్పదు. ఇక అన్ని పనులు కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగష్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్తున్నారు.