హమ్మయ్య “పుష్ప 2” యూనిట్ కి బిగ్ రిలీఫ్..!

టాలీవుడ్ నుంచి రానున్న పలు భారీ చిత్రాల్లో అవైటెడ్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2” కూడా ఒకటి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాపై గట్టి అంచనాలు నెలకొనగా ఈ సినిమా యూనిట్ ఈ మధ్య ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్స్ తో సినిమా రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని కన్ఫర్మ్ చేస్తున్నారు.

కాగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నా సమయంలోనే ఊహించని విధంగా ఈ సినిమా కీలక నటుడు అయినటువంటి జగదీశ్ బండారి అరెస్ట్ కావడం చిత్ర యూనిట్ కి పెద్ద షాక్ గా మారింది. ఓ అమ్మాయి ఆత్మ హత్య కేసులో తాను ప్రధాన నిందితుడిగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయగా పుష్ప 2 లో అల్లు అర్జున్ తో చాలా సీన్స్ ఉన్నాయి ఎలాగా అని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఫైనల్ గా చిత్ర యూనిట్ పెద్ద ఊరటనే వచ్చింది. ఈ టాలెంటెడ్ నటుడు ఇప్పుడైతే బెయిల్ మీద జైలు నుంచి ఈరోజే బయటకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో పుష్ప 2 సినిమా ఇక ఎలాంటి టెన్షన్ లేకుండా షూటింగ్ కంప్లీట్ అవుతుంది అని చెప్పవచ్చు.

పుష్ప 1 లో కేశవ పాత్ర ఎంత కీలకంగా కనిపించిందో తెలిసిందే. ఇప్పుడు పార్ట్ 2 లో కూడా సాలిడ్ రోల్ ని దర్శకుడు సుకుమార్ డిజైన్ చేసారని టాక్ ఉంది. మొత్తానికి అయితే తాను బయటకి వచ్చి ఇక షూటింగ్ లో పాల్గొంటాడని అప్డేట్.