తెలుగు స్టేట్స్ లో “పుష్ప 2” కి టూ మచ్ గా అడుగుతున్నారా??

వచ్చే ఏడాదిలో టాలీవుడ్ సహా పాన్ ఇండియా మార్కెట్ లో రానున్న కొన్ని అవైటింగ్ చిత్రాల్లో సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మాసివ్ పాన్ ఇండియా సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు.

మరి ఇండియా వైడ్ గా పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. దీనితో పార్ట్ 2 పై కూడా హైప్ వేరే లెవెల్లో ఉంది. దీనితో నిర్మాతలు ఈ హైప్ ని క్యాష్ చేసుకుంటున్నారు అని మొదటి నుంచి కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. కాగా ఇప్పుడు ఇదే తరహాలో మరో షాకింగ్ బజ్ అయితే పుష్ప బిజినెస్ పై వినిపిస్తుంది.

తెలుగు స్టేట్స్ లో నిర్మాతలు అడుగుతున్నా ధరలు చూస్తే డిస్ట్రిబ్యూటర్స్ లు మతి పోతుందట. ఒక్క ఏపీ లోనే పుష్ప 2 కి 100 కోట్ల ధర అడుగుతున్నారని ట్రేడ్ సర్కిల్స్ టాక్ ట్రెండ్ అవుతుంది. ఇక తెలంగాణాలో అయితే 90 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.

దీనితో ఇదొక సెన్సేషనల్ రికార్డు అని చెప్పాలి. అయితే ఈ మొత్తంలో డీల్ అయితే ఇంకా లాక్ కాలేదని మేకర్స్ ఇంత మొత్తం అడుగుతున్నారు. కానీ ఇంకా ఇంత ఇచ్చేందుకు ఎవరూ రెడీగా లేరని తెలుస్తుంది. రిలీజ్ ఏమో కానీ ఇంత మొత్తంలో బిజినెస్ అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. మరి చూడాలి ముందు ముందు పుష్ప 2 కి ఎలా ఉంటుందో అనేది.