సంక్రాంతి పోటీ రంజుగా సాగుతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా సినిమాలు రిలీజయ్యాయి. ఒకదానితో ఒకటి పోటీపడుతూ ఓపెనింగులు తెస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్లు మొదటి రోజు వసూళ్లు కలుపుకుని ఏకంగా వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. తొలి వీకెండ్ నాటికి ఈ చిత్రం రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అలాగే ఈ ఆదివారం నాడు రిలీజైన అల వైకుంఠపురములో ఓవర్సీస్ రిపోర్ట్ పరిశీలిస్తే.. హాఫ్ మిలియన్ మార్క్ ని చేరుకుని 600 కె డాలర్లు వసూలు చేసే దిశగా సాగుతోందని ట్రేడ్ చెబుతోంది. ఇక తొలి వీకెండ్ ఈ చిత్రం 2 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏడాది కాలంగా ఓవర్సీస్ దిగాలుగా ఉంది. పాన్ ఇండియా సినిమాలే మెప్పించలేకపోయాయి. అయితే ఈ సంక్రాంతి పుంజులు మాత్రం రంజుగానే వసూళ్లు సాధిస్తుండడం హుషారు పెంచుతోంది.
ఈ జోరు ఇలాగే సాగితే ఈ సంక్రాంతి మంచి రిజల్ట్ అందుకున్నట్టే. ఇక అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరు చిత్రాలకు ఇంచుమించు ఒకే టాక్ వినిపించింది. మిశ్రమ స్పందనలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వసూళ్ల లెక్కలు తేలాల్సి ఉందింకా.