శ్రీ‌రామ్ వేణు – బ‌న్నీ మ‌ధ్య‌లో ఏం జ‌రిగింది?

యంగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌రామ్ వేణుకు స్టార్ హీరో షాకివ్వ‌బోతున్నాడా?.. త‌న‌తో సినిమా చేస్తాన‌ని ప్రామిస్ చేసిన స్టార్ హీరో ఆ మాట‌ని ప‌క్క‌న పెట్టి సినిమాని ప‌క్క‌న పెట్టేస్తున్నాడా? అంటే ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా హీరో? ఏమా సినిమా? అంటే ఆ హీరో మ‌రెవ‌రో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. ఆ సినిమా `ఐకాన్‌`.

దిల్ రాజు నిర్మించాల‌ని ప్లాన్ చేసిన ఈ చిత్రం సుకుమార్ ప్రాజెక్ట్ కార‌ణంగా వాయిదా ప‌డింది. అయితే ఇన్ సైడ్ టాక్ ఏంటంటే స్క్రిప్ట్ లో అల్లు అర్జున్ కొన్ని మార్పులు అనివార్యంగా చేయాల్సిందేన‌ని చెప్పాడ‌ట‌. ఆ మార్పులు చేస్తేనే సినిమా చేద్ధామ‌ని చెప్ప‌డంతో శ్రీ‌రామ్ వేణు ఆ ప‌నుల్లో వుండ‌గానే `వ‌కీల్ సాబ్‌` అవ‌కాశం రావ‌డంతో `ఐకాన్‌` క‌థ‌ని ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలిసింది. `అల వైకుంఠ‌పుర‌ములో` ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన నేప‌థ్యంలో `ఐకాన్‌` ని అల్లు అర్జున్ చేయ‌డం కష్ట‌మే అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ప‌వ‌న్‌ని డైరెక్ట్ చేస్తున్న ఆనంద‌లో వున్న శ్రీ‌రామ్ వేణుకు ఈ వార్త నిజంగా పెద్ద షాకే.