బ‌న్నీ స్టెప్పుల‌కు బాలీవుడ్ బుట్ట‌బొమ్మ కూడా ఫిదా!

బాలీవుడ్ హాట్ బుట్ట బొమ్మ దిషా ప‌టాని. అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని `బుట్ట‌బొమ్మ‌..` పాట‌కు ఫిదా అయిపోయింది. ఈ పాట‌లో అల్లు అర్జున్ వేసిన స్టెప్పుల‌కు దిషా మెస్మ‌రైజ్ అయిపోయిందట‌. ఓ షాట్‌లో అల్లు అర్జున్ ఏట‌వాలుగా వున్న బ‌ల్ల‌పై నుంచి కింద‌కి జారుతూ వేస్తున్న స్టెప్పులు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించాయ‌ట‌.

దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసిన దిషా పటాని ఇది ఎలా సాధ్య‌మైంద‌ని బ‌న్నీని సోష‌ల్ మీడియా వేదిక‌గా అడిగేసింది. ఆ ప్ర‌శ్న‌కు బ‌న్నీ వెంట‌నే స్పందించాడు. త‌న‌కు సంగీతం అంటే ఇష్ట‌మ‌ని, మంచి మ్యూజిక్ త‌న‌ని డ్యాన్స్ చేయిస్తుంద‌ని బ‌దులిచ్చాడు.

నీ ప్ర‌శంస‌ల‌కు ధ‌న్య‌వాదాలు అని బ‌న్నీ తెలిపితే `మాకు స్ఫూర్తిగా ఉన్నందుకు థ్యాంక్స్ అని దిషా బ‌న్నీపై ప్ర‌శంస‌లు కురిపించింది. వీరిద్ద‌రి సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దిషా ప‌టానీ కూడా బాలీవుడ్‌లో మంచి డ్యాన్స‌ర్‌, ఫైట‌ర్ కూడా.

అవే ఆమెకు బాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాల్ని తెచ్చిపెడుతున్నాయి. దానికి ఆమె గ్లామ‌ర్‌, హాట్ నెస్ అద‌ణ‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. దిషా ప‌టాని ప్ర‌స్తుతం స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న `రాధే` చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

#AlaVaikunthapurramuloo - ButtaBomma Video Song || Allu Arjun || Trivikram | Thaman Ft. Armaan Malik