అనుప‌మ‌కు షాకిచ్చిన హ్యాక‌ర్స్‌!

`ప్రేమ‌మ్‌` చిత్రంలో స్కూల్‌కి వెళ్లే అమ్మాయిగా క‌ర్లింగ్ హెయిర్‌తో క‌నిపించి ఆక‌ట్టుకుంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఈ సినిమాతో యూత్‌లో ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకుంది. దీంతో అనుప‌మ‌కు సోష‌ల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది. తెలుగులో `అఆ` సినిమాతో నాగ‌వ‌ల్లిగా ఎంట్రి ఇచ్చిన త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

దీంతో ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌కు తెలుగులోనూ భారీగానే ఫ్యాన్స్ ఏర్ప‌డ్డారు. ఇటీవ‌ల `రాక్ష‌సుడు` సినిమాతో హిట్‌ని ద‌క్కించుకున్నా అనుప‌మ‌కు తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్ లభించ‌లేదు. `రంగ‌స్థ‌లం` రూపంలో కోరి వ‌చ్చిన అదృష్టాన్ని కాద‌నుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని మిస్ చేసుకుంది. ప్ర‌స్తుతం హీరోయిన్‌గా , అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ద్విపాత్రాభిన‌యం చేస్తున్న అనుప‌మ‌కు తాజాగా హ్యాక‌ర్స్ షాకిచ్చారు.

నిత్యం సోష‌ల్ మీడియా ఫేస్‌బుక్ ద్వారా ఫ్యాన్స్‌తో ట‌చ్‌లో వుంటున్న అనుప‌మ‌కు హ్యాక‌ర్స్ ఆమె ఫేస్‌బుక్ పేజీని హ్యాక్ చేసి షాకిచ్చారు. విష‌యం తెలుసుకున్న అనుప‌మ త‌న ఫేస్ బుక్ పేజీ హ్యాక్‌కు గురైంద‌ని, అందులో వ‌చ్చే పోస్ట్‌ల‌ని న‌మ్మ‌వ‌ద్ద‌ని పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గుర‌వుతున్నార‌ట‌.