Anupama: టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనుపమ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో వరుసగా సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. కాగా మొన్నటి వరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ పాత్రలకు సైతం సై అంటోంది.
ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మూవీ పరదా. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సందడి చేశారు. నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మను అనుపమ దర్శించుకున్నారు. తాను నటించిన కొత్త సినిమా ఆగష్టు 22న విడుదల కానుంది. దీంతో అమ్మవారి ఆశీస్సుల కోసం చిత్ర యూనిట్ వెళ్లి ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
ఆపై ఆలయంలో పూజలు నిర్వహించారు. తన సినిమా పరదా నుంచి యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః సాంగ్ పోస్టర్‌ను అక్కడ ప్రదర్శించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా తాను నటించిన సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు అనుపమ. ఈ సినిమాతో పాటు ఇంకా అనేక సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు అనుపమ.
Anupama: బల్కంపేట్ ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనుపమ.. అందుకోసమేనా?
