అందుకేనా  కాజల్ కుస్తీలాట!

అందుకేనా  కాజల్ కుస్తీలాట!

 
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ జిమ్ లో తెగ కష్టపడుతోంది. ఎంత సీరియస్‌గా అంటే.. రాత్రికి రాత్రి ఫిజిక్ పెర్ఫెక్షన్ పెంచుకునేంతగా. ఎందుకు? అంటే హాలీవుడ్ సినిమా కోసం. తెలుగు, తమిళ సినిమాలంటే బబ్లీ బ్యూటీతో మేనేజ్ చేయొచ్చు. హాలీవుడ్‌లో అలా కుదరదు. ఫిజికల్ ఫిట్‌నెస్ తగ్గతే హాలీవుడ్ జనాలకు రుచించదు. అందుకే కాజల్ కుస్తీలాట.
 
కాజల్‌కు ఓ హాలీవుడ్ సినిమా ఛాన్స్ రావడం తెలిసిందే. వచ్చే నెలలోనే షెడ్యూల్ మొదలుకానుందట. అందుకోసం జిమ్‌లో హైరానా పడుతోంది ఈ బ్యూటీ. ఎక్సర్‌సైజ్‌తో సాధించిన స్టిఫ్‌నెస్ పిక్స్ సోషల్ మీడియాకు వదలుతుండటంతో నెటిజనులు ఫిదా అయపోతున్నారు. దాదాపు 12 ఏళ్లుగా టాలీవుడ్‌తోపాటు తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ ఎంజాయ్ చేస్తోన్న కాజల్‌కు ఈమధ్య ఛాన్స్‌లు తగ్గాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకుని సీతగా కొత్త ప్రయత్నం చేసింది. అయనా వర్కవుట్ కాలేదు. అదే టైంలో హాలీవుడ్ ఛాన్స్ దక్కింది.
 
వచ్చేనెలలో సినిమా షూటింగ్‌లో పాల్గొనాలి కాబట్టి భయంకరంగా వర్కవుట్స్ చేస్తోందట. కాజల్ ప్రస్తుతం భారతీయుడు 2లో నటిస్తోంది. శర్వానంద్ సరసన చేసిన రణరంగం ఆగస్టులో విడుదలవుతోంది. జయం రవి సరసన చేసిన కోమలి సైతం ఆగస్టు 15నే విడుదలవుతోంది. ప్రస్తుతం గ్లామర్ డోస్ పెంచే పనిలో నిమగ్నమైంది  కాజల్‌! అల్ ది బెస్ట్ చందమామ!