డిజిటల్ యుగంలో ఏదైనా సాధ్యమే. ఎక్కడో మారు మూల ఉన్న కామన్ జనాలకే కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తోంది. ఇక మోడల్స్.. నటీమణులకైతే పబ్లిసిటీ మరింత సులువు అయిపోయింది. అసలు పీఆర్ వో తో పనే లేకుండా నేరుగా దర్శకనిర్మాతలనే సంప్రదించే వెసులుబాటు కలిగింది. అలానే ముంబైకి చెందిన ఓ హాటీ నాటీ బ్యూటీ నేరుగా తెలుగు నిర్మాతల్ని .. యువ దర్శకుల్ని అందాల వలలు విసిరి వెంటాడేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ అమ్మడు సోషల్ మీడియా లింకుల్ని నేరుగా టాలీవుడ్ దర్శకనిర్మాతలకు షేర్ చేస్తోందిట. అందులో వేడెక్కించే వర్కవుట్ల ఫోటోలు వీడియోలు ఉన్నాయి. డ్యాన్సింగ్ వీడియోలు.. మెంటలెక్కించే ఫోటోషూట్లు ఉన్నాయిట. ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ షంటేస్తూ రెగ్యులర్ గా ఫోటోల్ని షేర్ చేస్తోందట. అంతేకాదు మన దర్శకనిర్మాతలకు రిబేట్లు ఆఫర్లు ఇస్తోందట. పారితోషికం లో ఏమాత్రం బెట్టు చేయడం లేదు. అయితే ఆఫర్ మాత్రం క్రేజీగా ఉండాలని షరతులు పెడుతోందట. అగ్ర హీరోల కే తొలి ప్రాధాన్యత అని సీక్రెట్ పీఆర్ తో చెప్పిస్తోందట. మొత్తానికి తెలుగు పరిశ్రమను ఏదోలా గుప్పిట పట్టాలన్నది ఈ అమ్మడి ప్లాన్. అయితే తన పన్నాగం వర్కవుటైందన్న గుసగుస కూడా వినిపిస్తోంది. సదరు హాట్ గాళ్ అందాల ఎరకు ఇప్పటికే పలువురు నిర్మాతలు స్పెల్ బౌండ్ అయిపోయారట. తదుపరి చిత్రంలో తొలి ప్రాధాన్యత నీకే! అంటూ ఆఫర్ చేసేశారట. అంతేనా.. ఇకపై అడ్వాన్సుల లెవల్ కి చేరిపోనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరీ ముంబై హాటీ? అంటే.. ఓ చిన్న క్లూ. ఇప్పటికే పలు హాట్ కంటెంట్ సినిమాలతో తన ఉనికిని చాటుకుంది. ఇన్ స్టాలో అందాల ఆరబోతతో వేడెక్కించడం.. హద్దులు చెరిపేయడం ఈ అమ్మడికి తెలిసిన విద్య. ఇన్ స్టాలో పలు కమర్షియల్ ప్రకటనలతోనూ వేడెక్కిస్తోంది. ఇక బుల్లితెర నుంచి వెండితెర ప్రమోషన్ కోసం ఈ అమ్మడు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఇంత క్లూ ఇచ్చేశాం కదా.. కనీసం ఇకనైనా కనిపెట్టండి చూద్దాం.