బాహుబలి ప్రభాస్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సాహో’. పలు భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. బాహుబలి తర్వాతా ప్రభాస్ ఎంచుకున్న చిత్రం, అతి దీర్ఘకాలం షూటింగ్ చేసుకున్న చిత్రం, భారీ బడ్జెట్, భారీ తారాగణం హాలీవుడ్‌ని తలదన్నే హై క్వాలిటీ ఇలా సాహో కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా చేశాయి.
ఇక ఈ సినిమా యు/ఏ సర్టిఫికెట్ తెచ్చుకోగా 2.54 గంటల నిడివి కలిగింది. ఇక చిత్ర విడుదల దగ్గర పడడంతో యూనిట్ సభ్యుల్లో ఉద్విగ్నత ప్రేక్షకుల్లో ఉత్కంఠ తప్పవు. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తే, జాకీష్రాఫ్, మందిరాబేడి, నీల్ నితిన్ ముఖేష్, చంకీపాండే, అరుణ్‌విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 30న థియేటర్లకు వస్తోంది.