భారీ బడ్జెట్ భారీ యాక్షన్ భారీ తారాగణం ఇలా అన్నీ భారీ భారీగా తెర పై ఆవిష్కరించడానికి సాహో బృందానికి కొన్నేళ్లు పట్టింది. తీరా తెర పైకి వచ్చాక ఫలితం మరో విధంగా ఉంది. ఆ పైన పైరసీ ఇక్కట్లు చుట్టూ ముట్టాయి. ఇది చాలదన్నట్టు ప్రముఖ హీరోయిన్ సాహో ఒక ఆర్టిస్ట్ వర్క్ ను కాపీ కొట్టిందంటూ సోషల్ మీడియాలో పెట్టేసింది.
విషయం ఏంటంటే షిలో శివ్ సులేమాన్ అనే ఒక ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ ను యధాతధంగా సాహో లో వాడేశారనీ ఇందుకు తగ్గ రుసుము ను ఆ ఆర్టిస్ట్ కు చెల్లించలేదని లిసా రే సోషల్ మీడియాలో పేర్కొంది. కనీసం ఆమెకు అందుకు తగ్గ గుర్తింపు కూడా ఇవ్వలేదని, ఎక్కడా దీనిని స్ఫూర్తి పొందడం అన్నారని ఇది పూర్తిగా మరొక ఆర్టిస్ట్ ప్రజ్ఞను దోచుకోవడమే అనీ ఇటువంటివి అందరూ నిలదీయాలని రాసుకొచ్చింది.
మరి దీనికి సంబంధించి దర్శకనిర్మాతలు ఏం చెప్తారో చూడాలి.