`బాహుబలి` తరువాత తెలుగు సినిమా బడ్జెట్ పెరిగింది. 50 కోట్లు, 100 కోట్లు బడ్జెట్ వుంటేగానీ స్టార్స్ సినిమాలు చేయడం లేదు. ఆమాత్రం బడ్జెట్ లేకపోతే ఆసక్తి కూడా చూపించడం లేదు. కానీ గత కొన్నేళ్ల క్రితం తెలుగు సినిమాల బడ్జెట్ లక్షల్లో వుండేది. రాబడి కూడా అందుకు తగ్గ్టే వుండేది. సూపర్‌స్టార్ కృష్టన నటించిన సంచలన చిత్రం `అల్లూరి సీతారామరాజు. తెల్ల దొరలపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసి వారి గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచిన మన్యం వీరుడు అల్లూరి జీవిత కథ ఆధారంగా కృష్ణ చేసిన ఈ చిత్రం విడుదలై సిరగ్గా ఈ రోజుకి 46 ఏళ్లు పూర్తయ్యాయి.
1974 మే 1న ఈ చిత్రం విడుదలైంది. కృష్ణ ఈ సినిమా చేయడం వెనక పెద్ద కథే నడిచింది. అల్లూరి కథని ముందు అక్కినేనితో చేయాలని తాతినేని ప్రకాశరావు ప్రయత్నించారు. ఇదే కథని ఆ తరువాత శోభన్‌బాబుతో రూపొందించాలని అప్పట్లో ఓ నిర్మాత పూనుకున్నాడు కానీ ముందుకు కదలలేదు. ఎన్టీఆర్ చేయాలనుకున్నా లేట్‌గా స్పందించారు.
అప్పటికే కృష్ణ ఈ చిత్రాన్ని చేసేశారు. త్రిపురనేని మహారథి ఈ చిత్రానికి కథ అందించగా కృష్ణ సోదరుడు జి. ఆదిశేషగిరిరావు నిర్మించారు. వి. రామచంద్రరావు దర్శకత్వం వహించారు. కృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ గురించి తెలిస్తే స్టార్ హీరోలు అవాక్కవ్వాల్సిందే. ఈ సినిమాకు అయిన బడ్ఎట్ కేవలం 10 లక్షలు మాత్రమే అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కానీ అక్షరాల ఇది నిజం. 60 రోజుల్లో ఎన్నో వ్యవ ప్రయాసల కోర్చి పక్కా ప్లానింగ్‌తో ఈ చిత్రాన్ని పద్మాలయా సంస్థ నిర్మించింది. ఈ చిత్రం ద్వారా సినిమా స్కోప్ అనే కొత్త టెక్నాలజీని తెలుగు తెరకు పరిచయం చేశారు. తెలుగు చిత్రాల్లో మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రం ఇదే.