షాకింగ్ న్యూస్.. సోనాలి బింద్రేకి క్యాన్సర్

నటి సోనాలి బింద్రే క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నట్టు తానే స్వయంగా వెల్లడించారు. తను హై గ్రేడ్ క్యాన్సర్ భారిన పడ్డట్టు ట్విట్టర్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం న్యూయార్క్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలియజేసింది. తరచుగా నొప్పి ఇబ్బంది పెట్టడంతో డాక్టర్లను సంప్రదించానని, వారు చేసిన పరీక్షల్లో ఈ క్యాన్సర్ ఉన్నటు బయటపడిందని తెలిపింది.

అయితే ఈ వ్యాధితో పోరాటం చేయటానికి తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో మనో ధైర్యాన్ని ఇస్తున్నారని వారందిరికి నా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సోనాలి వయస్సు 43 ఏళ్ళు. ఈ విషయం తెలియగానే అభిమానులు ఎంతో బాధతో సోనాలి త్వరగా కోలుకోవాలని రీట్వీట్స్ చేస్తున్నారు.