సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్..! కారణం ఏంటి..?

శిల్పాశెట్టి తన అందం, అభినయంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. 45 సంవత్సరాల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో కుర్రాళ్ల మనసు దోచుకుంటోంది. శిల్పా శెట్టి బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది. వెంకటేష్ హీరోగా నటించిన సాహస వీరుడు సాగర కన్య సినిమాలో శిల్పా శెట్టి నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది. ఒకవైపు సినిమాలతో మరొకవైపు టీవీ షోస్ తో బిజీగా ఉండే శిల్పాశెట్టి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

శిల్పాశెట్టి సోషల్ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలు వీడియోస్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉండేది. అంతే కాకుండా తరచు యోగా, వ్యాయమం చేస్తున్న ఫిట్నెస్ వీడియోలను సోషియల్ మీడియాలో షేర్ చేస్తూ తన పాలోవర్స్‌కు సూచనలు ఇచ్చేది. ఇటీవల శిల్పాశెట్టి సోషల్ మీడియాకు విరామం ఇచ్చినట్టు ప్రకటించింది. సోషల్ మీడియాలో ఎటువంటి కొత్తదనం లేకుండా అంతా ఒకే లాగా కనిపిస్తూ చాలా బోర్ కొట్టేసింది. ఏదైనా కొత్తదనం కనిపించే వరకూ సోషియల్ మీడియాకి విరామం ఇస్తున్న అంటూ శిల్పా శెట్టి ప్రకటించింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పూర్తి బ్లాక్‌ ఫొటోను షేర్‌ చేసింది.

ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఫిట్నెస్ వీడియోలను షేర్ చేస్తూ చాలామందికి సలహాలు ఇచ్చే శిల్పా ఇలా సోషల్ మీడియా కు గుడ్ బై చెప్పటంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం శిల్పా శెట్టి ‘ ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను డైరెక్టర్ రోహిత్ శెట్టి, అమెజాన్ ప్రైమ్‌తో కలిసి రూపొందిస్తోంది. ఈ వెబ్ సీరీస్ ద్వార శిల్పా ఓటిటిలో సందడి చేయనుంది. ఇక టాలీవుడ్ లో కూడ శిల్ప కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.