మరోసారి తెలుగు సినిమాలో అడుగుపెట్టనున్న ఐశ్వర్యరాయ్..

బాలీవుడ్ బ్యూటీ, విశ్వ సుందరి ఐశ్వర్యారాయ్ మరోసారి తెలుగు సినిమాలో కనిపించనుంది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ఈ అమ్మడు నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక తాజాగా ఈ క్రేజీ అప్డేట్ బయటకి రావడంతో.. ఆమెను తమ సినిమాల్లో తీసుకోవాలి అని సినీ బృందం భావిస్తోందట. అంతేకాకుండా ఈ విషయం గురించి రాజమౌళి ఆలోచిస్తున్నాడు అని తెలుస్తుంది. పైగా ఆమెతో సంప్రదింపులు కూడా చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం గురించి క్లారిటీ ఎప్పుడొస్తుందో తెలియాల్సి ఉంది.