Priyanka Chopra: ‘ప్రియాంక చోప్రా’… ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడు యూనివర్సల్ హీరోయిన్. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని అమెరికాలో పాగా వేసేసింది. నిక్ తో పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే హాలీవుడ్ సినిమాలలో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ గ్లోబల్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్‌లో టాప్ గేర్ లో దూసుకెళుతోంది. ఫాలోవర్ల విషయంలో ఆమె హీరోయిన్లందరికంటే టాప్‌లో నిలిచి… తన క్రేజే సెపరేట్ అనిపించుకుంది. ఇన్‌స్టాలో ప్రియాంకకు 72.4మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోయింగ్ తో హీరోయిన్స్ లో ఆమెనే నెంబర్ వన్.
ఇక ప్రియాంక తర్వాత శ్రద్ధాకపూర్ 68.5మిలియన్లు, దీపిక పదుకొణె 63.4మిలియన్లతో రెండు, మూడు స్థానాలలో ఉన్నారు. వీరి తర్వాత అనుష్క శర్మ 60.4మిలియన్లు, కత్రినా కైఫ్ 55.9మిలియన్లు ఫాలోయర్స్ కలిగి ఉన్నారు. హీరోల్లో 58.3మిలియన్ల ఫాలోవర్లతో అక్షయ్ కుమార్ టాప్‌లో ఉన్నాడు. కానీ ‘ప్రియాంక చోప్రా’ని మాత్రం ఎవ్వరూ బీట్ చేయలేకపోయారు.
తన కొంటె చూపుతో కుర్రోళ్ల మతులు చెదరగొట్టే ప్రియాంకకి కెరీర్ మొదట్లో దారుణమైన అవమానాలు ఎదురైనాయి. ఆమెను చూసిన కొంతమంది అసలు నువ్వు హీరోయిన్ గా పనికిరావు అని చాలా రకాలుగా అన్నారట. పైగా ఆమె బాడీ పార్ట్స్ మీద కూడా అప్పట్లో కొంతమంది దర్శకులు ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేశారని… అయినా అన్నిటినీ భరించి, అందర్నీ సంతృప్తి పరిచి హీరోయిన్ గా ఎదిగాను అని ఈ డస్కీ బ్యూటీ చాలా బోల్డ్ గా చెప్పింది.