మహేష్, రాజమౌళి సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇందులో నిజమెంత?

రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది అంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. రాజమౌళి సినిమాల విషయంలో ప్రతిదీ ఎంతో పద్ధతిగా సరైన ప్లానింగ్ ప్రకారం చేస్తూ ఈ సినిమాని భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. పాత్ర చిన్నదైనా రాజమౌళి స్టార్ సెలబ్రిటీలను రంగంలో దింపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ పాత్రకు అనుగుణంగా ఉన్న వారిని ఎంపిక చేయడంలో రాజమౌళి దిట్ట అని చెప్పాలి. ఇలా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి.

ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఆఫ్రికా అడుగుల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది అని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే రాజమౌళి మహేష్ బాబు సినిమా ప్రారంభమవుతుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించడం కోసం మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ను రంగంలోకి దింపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఐశ్వర్యరాయ్ వరకు చేరిందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతోంది.

ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా ఈమె ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇలాంటి పాపులారిటీ ఉన్నటువంటి హీరోయిన్ మహేష్ బాబు సినిమాలో చేస్తే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వెండితెరపై బొమ్మ పడితే దద్దరిల్లి పోవాల్సిందే.ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం మహేష్ బాబు సినిమాలో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ అంటే సాధ్యమయ్యే పనేనా అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.