విరాట పర్వంలో జర్నలిస్ట్ గా సాయి పల్లవి

పీరియడ్ ఫిలిం గా తెరకెక్కుతున్న సినిమా ‘విరాట పర్వం 1992’. ఈ సినిమాలో రానా, సాయి పల్లవి, టబు మొదలైన వారు నటీనటులు. ఈ సినిమాని ‘నీది నాది ఒకే కథ’ చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నారు. 90 ల నాటి కాలమాన పరిస్థితులకు అద్దం పడుతుందని టైటిల్ చూస్తే అర్ధం అవుతుంది.
ఈ సినిమాలో హీరోయిన్ ది చాలా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. పైగా సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుంది. అందువల్ల అలాంటి పాత్రలో బాగా నటించగలిగే సామర్ధ్యం ఉన్న సాయి పల్లవి ని ఎంచుకున్నారని సమాచారం. పైగా ఈ సినిమాలో సాయి పల్లవి ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. ఒక సామాజిక సమస్య దానికి తగ్గ రాజకీయ పరిణామాలు ఈ చిత్రంలో మనకు కనిపిస్తాయట. ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది.