రాఘవేంద్ర రావు సమర్పణలో దర్శకుడు క్రిష్ సినిమా

దర్శకుడు క్రిష్ ప్రతిభ గురించి చెప్పేదేముంది. చాలా మంచి దర్శకుడు. అయితే ఆయన తాజాగా తీసిన బయోపిక్ నిరాశ పరిచింది. అయినా ఇవన్నీ సహజమే పరిశ్రమలో. అందువల్ల ఆయనకు జరిగిన నష్టమేమీ లేదు. ప్రస్తుతం కొత్త సినిమా స్క్రిప్ట్ల మీద పని చేస్తున్నాడు.

క్రిష్, రాఘవేంద్ర రావు సమర్పణలో ఒక సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో నాగ శౌర్య హీరో. హీరో ఒక్కడైనా దర్శకులు మాత్రం ముగ్గురు. అవును, రాఘవేంద్ర రావు తాజాగా నాగ శౌర్య తో ఒక సినిమా ప్రకటించారు. ఈ సినిమాకు ముగ్గురు దర్శకులు ఉంటారనీ, ఈ సినిమాలో ఉండే మూడు ప్రేమ కధలను ముగ్గురు తెరకెక్కిస్తారనీ చెప్పారు, అందులో ఒకరు క్రిష్ అన్న మాట.

ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ వివరాలు త్వరలో తెలియనున్నాయి. నాగ శౌర్య ప్రస్తుతం తన సినిమాలన్నీ పూర్తి అయిన తరువాత ఈ సినిమా చేయనున్నారు.