హీరో నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు

 హీరో నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కు సంబంధించి బాలయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన నటించిన ఈ  ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి పన్ను రాయితీ తీసుకొని కూడా టికెట్‌ రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ పరిస్థితి ఎదురైంది.  పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు బదలాయించలేదని సుప్రీంకోర్టు తమ నోటీసులో వెల్లడించింది. దీంతో పన్ను రాయితీ పొందిన డబ్బు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా పిటిషన్‌లో స్పష్టంగా విజ్ఞప్తి చేసింది. ఈ కేసు విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వై.చంద్ర చూడ్ ధర్మాసనం.. వివరణ ఇవ్వాల్సిందిగా  హీరో నందమూరి బాలకృష్ణ  సహా ప్రతివాదులందరికీఈ  నోటీసులు జారీ చేయడం గమనార్హం!