`బాహుబ‌లి`ని వ‌ద‌ల‌ని జ‌క్క‌న్న‌!

దేశ‌ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం `బాహుబ‌లి`. తెలుగు సినిమా స్థాయిని, మార్కెట్‌ని పెంచి గౌర‌వాన్ని తీసుకొచ్చిన చిత్ర‌మిది. తెలుగు సినిమా అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న గ‌త రూమ‌ర్‌ల‌కు చెక్ పెట్టి ఇదీ తెలుగు సినిమా అని నిరూపించిన చిత్ర‌రాజ‌మిది. రాజ‌మౌళి క‌ల‌ల ప్రాజెక్ట్‌గా తెర‌పైకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్నో రికార్డుల్ని తిర‌గ‌రాసి బాలీవుడ్ మేక‌ర్స్ సైతం అసూయ‌ప‌డేలా చేసింది. అ చిత్రాన్ని అన్ని ర‌కాలుగా ప్ర‌మోట్ చేసి జ‌నాల్లోకి తీసుకెళ్లిన రాజ‌మౌళి సినిమా విడుద‌లై ఇన్నేళ్ల‌వుతున్నా ఇంకా దాన్ని వ‌ద‌ల‌డం లేదు.

కామిక్ బుక్స్‌, టాయ్స్‌.. ఇలా ఏది దొరికితే దాని ద్వారా `బాహుబ‌లి` క్రేజ్‌ని విశ్వ‌వ్యాప్తం చేశాడు. తాజాగా ఈ సినిమాలో పాపుల‌ర్ అయిన కిలికి భాష‌ని కూడా పాపుల‌ర్ చేయ‌డానికి శ్రీ‌కారం చుట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కాల‌కేయుల కోసం సినిమాలో కిలికి భాష‌ని కనిపెట్టి కొత్త‌గా ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. దీన్ని ప్ర‌ముఖ త‌మిళ గేయ‌ర‌చ‌యిత వైర‌ముత్తు త‌న‌యుడు మ‌ద‌న్ కార్కే సృష్టించి ఈ సినిమా కోసం అందించాడు. అది అద్భుతంగా పేలింది. దీంతో ఈ భాష‌పై తాజాగా వెబ్ సైట్ ని ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి లాంఛ‌నంగా ప్రారంభించ‌డం విశేషం.

`మ‌ద‌న్ కార్కే కిలికి భాష‌ను ఎంతో రీసెర్చ్ చేసి బాహుబ‌లి సినిమా కోసం సృష్టించాడు. ప్ర‌పంచంలో అత్యంత యంగెస్ట్ అండ్ ఈజీయెస్ట్ లంగ్వేజ్ ఇది. దీన్ని సులువుగా ఎవ్వ‌రైనా నేర్చుకోవ‌చ్చు` అని రాజ‌మౌళి ట్వీట్ చేశాడు.