ఈ సంక్రాంతికి నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి అందులో రజనీకాంత్ `దర్బార్` చిత్రం పర్వాలేదనిపించుకుంటే… మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం క్లాస్ హిట్ అయితే… అలవైకుంఠపురంలో మాస్ హిట్ అయింది. ఇక పండగ రోజే విడుదలైన ఎంత మంచివాడవురా మాత్రం ఆశించినంత ఫలితం రాలేదు. ఇక ఇదిలా ఉంటే మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ చిత్రం రజనీ గత చిత్రాలకంటే పర్వాలేదనిపించుకుంది. రజనీవి ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలు పెద్దగా హిట్ అయిన దాఖలాలు లేవు. దాంతో దర్బార్ చిత్రంతో రజనీ ఫ్యాన్స్ కాస్త ఖుషీ అయ్యారనే చెప్పాలి. మురుగుదాస్ రజనీని మళ్ళీ ట్రాక్‌లో పెట్టినట్లు అనిపించింది ఈ చిత్రంతో.
ఇక మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రం హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్వకత్వంలో తెరెకెక్కింది. అనిల్ తనదైన శైలితో మంచి కామెడీ టైమింగ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేష్ కామెడీ టైమింగ్ అలాగే విజయశాంతి ఎమోషన్స్ ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పాలి. ప్రకాష్‌రాజ్, విజయశాంతి ఇలాంటి మంచి కాస్ట్ అండ్ క్రూ మొత్తం ఈ చిత్రంలో కనబడుతుంది. దీంతో మహేష్ అనిల్ డైరెక్షన్ పై ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఆయన్ని హగ్ చేసుకుని మరీ తన ఆనందాన్ని తెలిపారు.
బన్నీ విషయానికి వస్తే… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `అలవైకుంఠపుకంలో` ఈ చిత్రం మాస్ హిట్ అని చెప్పాలి. త్రివిక్రమ్ ప్యామిలీ ఎమోషన్స్ పండించడంలో దిట్ట అని చెప్పాలి. ఇక ఈ చిత్రం ఆడియో విషయానికి వస్తే తమన్ మంచి సంగీతాన్ని అందించారు. త్రవిక్రమ్, బన్నీ కాంబినేషన్లో రూపొందిన మూడవ చిత్రం ఇది. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ హిట్ అనే చెప్పాలి. గతంలో వచ్చిన సన్నాఫ్‌సత్యమూర్తి, జులై మూవీస్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
కళ్యాణ్‌రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రం సతీష్ వేగ్నేశ్ దర్శకత్వంలో రూపొందింది. ఆ చిత్రం ఈ సంక్రాంతిగా ఫ్లాప్ మూవీగా నిలిచింది. గతంలో సతీష్ తీసిన ఫ్యామిలీ ఎమోషన్స్ హిట్ అయ్యాయి కాని ఈ చిత్రంలో తీసుకున్న కాన్పెప్ట్ లో లాజిక్ మిస్ అయింది.