బుల్లితెర యాంకర్ ప్రదీప్ తొలిసారి హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?`.
ఎస్వీ బాబు నిర్మించిన ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహించారు. ఏ ముహూర్తాన ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడో కానీ ఈ సినిమా రిలీజ్‌కి నోచుకోవడం లేదు. ముందు మార్చి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
కరోనా విజృంభిన మొదలు కావడం.. జనతా కర్ఫ్యూ తరువాత 21 డేస్ పాటు లాక్‌డౌన్‌ని విధిస్తున్నామంటూ కేంద్రం ప్రకటించడంతో ఈ సినిమా పాలిట శాపంగా మారింది. ఈ చిత్రంలోని `నీలి నీలి ఆకాశం..` అంటూ సాగే పాట 100 మిలియన్ వ్యూస్ దాటడంతో ఈ చిత్రంపై మంచి ఆసక్తి ఏర్పడింది. కానీ సినిమా రిలీజ్ చేయలేని పరిస్థితి. తాజాగా మరోసారి లాక్‌డౌన్‌ని మే 7 వరకు పొడిగించడంతో ఈ చిత్ర నిర్మాత టెన్షన్ పడుతున్నాడట.
ఇదిలా వుంటే కోటి రూపాయలు ఇస్తాం ఈ చిత్రాన్ని మా ఓటీటీలో రిలీజ్ చేయండి అంటూ కొంత మంది బేరాలు మొదలుపెట్టారట. ఈ చిత్ర నిర్మాణానికి అయిన బడ్జెట్ 2 కోట్లు. పబ్లిసిటీకి మరో కోటి ఖర్చు పెట్టారట. మొత్తం 3 కోట్లయింది. ఈ మొత్తానికి వడ్డీ కలిపి 4 అయిందని నిర్మాత థియేటర్లలోనే రిలీజ్ చేయాలని, అలా చేస్తేనే పెట్టిన ఖర్చు పోనూ లాభాలు వస్తాయని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తానంటూ మొదట్ఓ గీతా ఆర్ట్స్ నిర్మాతకు 40 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చింది. ఈ నేపథ్యంలో డేగళ్ల ఈ సినిమా కోసం ఓటీటీలు కాచుకుని చూస్తున్నాయని ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.