నయన తార ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటుందా?

హీరోయిన్ నయన తార దశాబ్ద కాలం పైనే సినిమాల్లో రాణిస్తోంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఒకప్పుడు శింబు, తర్వాత ప్రభుదేవా తో ప్రేమలో ఉంది. ప్రభుదేవా తో పెళ్లి వరకు వెళ్లి వెనక్కి తగ్గింది.

ఆ తరువాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. ఈ విషయం వాళ్లిద్దరూ బాహాటంగా చెప్పకపోయినా బయటకి పొక్కిన తరువాత ఖండించను కూడా లేదు. పైగా వాళ్ళిద్దరి విహార యాత్ర ఫోటోలు సోషల్ మీడియాలో మాత్రం పెడుతుంటారు.

కొన్నేళ్లుగా సాగిన వీరి ప్రేమాయణం ఇప్పుడు పెళ్లి పీటలెక్కనుందని సన్నిహితుల వచనం. వీళ్ళిద్దరూ పెళ్లి తో ఒక్కటవ్వాలని అనుకుంటున్నారని ఈ ఏడాది చివరిలో వీరి పెళ్లి ఉండొచ్చట. చూద్దాం మరి నయన్ ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటుందో లేదో.