ఆండీ శ్రీనివాస్ కన్నా ముందే మంచు లక్ష్మి మరొక వ్యక్తిని వివాహం చేసుకుందా… ఆ వ్యక్తి ఎవరో తెలుసా?

ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా పాపులర్ అయిన ఎంతోమంది తమ వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలో నటీనటులుగా గుర్తింపు పొందారు. మంచు మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మీ ప్రసన్న నటిగా నిర్మాతగా, వ్యాఖ్యాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకుంది. అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మీ ప్రసన్న ఆ సినిమాలో ఒక పవర్ఫుల్ లేడీ విలన్ పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించింది.

అంతేకాకుండా ఎన్నో టీవీ షోలకు నిర్మాతగా, వ్యాఖ్యతగా కూడా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలకూ కూడా నిర్మాతగా వ్యవహరిస్తు..సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఇటీవల మంచు లక్ష్మి నిర్మిస్తున్న ఒక సినిమాలో తాను హోమోసెక్స్వల్ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మంచు లక్ష్మి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వారి మధ్య మనస్పర్ధలు రావడంతో ఒకరికొకరు దూరమై రెండవ వివాహం కూడా చేసుకున్నారు.

అయితే ఆండీ శ్రీనివాస్ ని పెళ్లి చేసుకోవడానికి ముందే మంచి లక్ష్మి కూడా మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాలేజీ రోజుల్లో తన స్నేహితుడైన లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని మంచు లక్ష్మి ప్రేమించి తన స్నేహితుల సహాయంతో తన తండ్రికి తెలియకుండా వివాహం చేసుకుందని తెలుస్తోంది. అయితే మంచు లక్ష్మి ఇలా చేయడం మోహన్ బాబుకు నచ్చకపోవటంతో వారిద్దరిని విడదీసి ఆమెను థియేటర్ ఆర్ట్స్ కోర్స్ నేర్చుకోవడానికి అమెరికాకు పంపించినట్లు సమాచారం. అయితే అమెరికాలో చదువుకునే రోజుల్లో ఆంటీ శ్రీనివాస్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి కుటుంబ సభ్యుల ఆమోదంతో అతనిని రెండవ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల గురించి లక్ష్మీ ప్రసన్న ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.