భూమా మౌనిక తో పెళ్లి కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న మంచు మనోజ్?

మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఈయన ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త దూరమవుతారు. ఇక ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. మనోజ్ నటించిన సినిమా విడుదలయ్యి కూడా కొన్ని సంవత్సరాలు కావస్తోంది.అయితే మనోజ్ సినిమాలకు దూరం కాలేదని పాన్ ఇండియా స్థాయిలో ఆయన అహం బ్రహ్మాస్మి అనే ఒక సినిమాను ప్రకటించారు.

ఈ సినిమా ప్రకటించింది మొదలు ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. అదేవిధంగా ఈ విషయం గురించి ఎప్పుడు ప్రస్తావనకు వచ్చిన మనోజ్ ఈ ప్రశ్నలను దాటవేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక నెటిజన్ తనని ప్రశ్నించగా మనోజ్ స్మైలీ బొమ్మను షేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే అహం బ్రహ్మాస్మి క్యాన్సిల్ అయిందని అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం మనోజ్ పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

ఈయన తన భార్య ప్రణతికి విడాకులు ఇచ్చిన అనంతరం ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత నేత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక రెడ్డితో రిలేషన్ లో ఉన్నారు.తాజాగా వీరి రిలేషన్ విషయం గురించి బయటపడటంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇదే విషయం గురించి మనోజ్ కూడా మాట్లాడుతూ త్వరలోనే ఈ శుభవార్తను అందరితో పంచుకుంటానని తెలిపారు.ఇక వీరిద్దరూ ఫిబ్రవరి మొదటి వారంలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఇక పెళ్లి తర్వాతే మనోజ్ తన దృష్టిని మొత్తం సినిమాలపై పెట్టబోతున్నారని అప్పుడే తన సినిమాల గురించి కొత్త అప్డేట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.