మగవారి పెళ్లి చేసుకోవడానికి గుండె జబ్బులకు గల కారణం ఏంటి నిపుణులు ఏమంటున్నారు?

Indian wedding hands

పెళ్లి బంధం తర్వాత పురుషులు తమ స్వేచ్ఛ మొత్తం హరించుకుపోయిందని, బంధాలకు బాధ్యతలకు మధ్య బానిసగా బతకాల్సి వస్తుందని,తమ స్వేచ్ఛకు పెళ్లి బంధం సంకెళ్లు వేసిందని ఇలా రకరకాల మాటలు చెబుతుంటారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం పెళ్లి చేసుకుంటే పురుషుల ఆయుష్షు పెరుగుతుందట. వారి గుండెకు పెళ్లి చాలా మేలు చేస్తుందట. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పురుషుడు పెళ్లి చేసుకుని తమ భాగస్వామితో సంతోషంగా గడిపితే జీవితకాలం పాటు గుండె జబ్బు వచ్చే ప్రమాదమే లేదని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎమోరీ యూనివర్శిటీకి చెందిన కొందరు పరిశోధకులు ఈ విషయంపై దాదాపు నాలుగేళ్ల పాటు 6,051 మందిపై జరిపిన పరిశోధనలో ఈ ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి. వీరి పరిశోధనల ప్రకారం పెళ్లయిన వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెళ్లి కాని వారితో పోల్చినప్పుడు 52 శాతం తక్కువగా ఉందని తెలుస్తోంది.పెళ్లికాని వారితో పోలిస్తే పెళ్లి చేసుకున్న వారిలో 24శాతం ఇతర జబ్బులు ప్రమాదం కూడా తక్కువగానే ఉంది.అలాగే ఈ పరిశోధనలో ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులకు గురైన వారిపై పరిశోధన చేయగా వారంతా దాంపత్య జీవనానికి దూరంగా ఉన్న వారేనని తేలింది.

వీరిలో భర్త లేదా భార్యని కోల్పోయిన వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 71శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇక విడాకులు తీసుకోవడం లాంటివి చేసిన వారిలో ఈ జబ్బులు వచ్చే అవకాశం 41శాతం ఉంది. అసలు వివాహమే చేసుకోని వారిలో 40శాతం రిస్క్ జీవితాన్ని అనుభవిస్తున్నారని ఈ పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిశోధనా ఫలితాలు కేవలం పురుషులకు మాత్రమే కాదు స్త్రీలకు కూడా ఇదే రకమైన ఫలితాలు వర్తిస్తాయని ఈ పరిశోధనలో పాల్గొన్న వైద్యులు సూచిస్తున్నారు. భార్యాభర్త ఇద్దరు కలిసి ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపడం అలవాటు చేసుకుంటే వీరిద్దరూ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు.