ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది కార్తీక పౌర్ణమి శుభతిథి ఎప్పుడో తెలుసా?

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు ఇలా 12 మాసాలలో కార్తీకమాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ కార్తీకమాసం శివకేశవులకు ప్రతీకగా భావిస్తారు.కార్తీక మాసంలో శివ కేశవులను ఆరాధించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని ఆ శివకేశవుల అనుగ్రహం మనపై ఉంటుందని భావించి పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇకపోతే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

కార్తీక పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున భక్తులు శివకేశవుల ఆలయాలను సందర్శించి దీపాలను వెలిగించి ప్రత్యేకంగా స్వామి వారిని పూజిస్తారు. మరి ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? కార్తీక పౌర్ణమి శుభతిథి ఎప్పుడు అనే విషయానికి వస్తే… ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ ఏడవ తేదీ సాయంత్రం 04:15 గంటలకు ప్రారంభమై నవంబర్ 8వ తేదీ సాయంత్రం 04 నుండి 31 వరకు ఉంటుంది. కనుక నవంబర్ 8వ తేదీ మంగళవారం కార్తీక పూర్ణిమ ఉపవాసం పూర్తిగా ఫలిస్తుంది.

ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరించి నది దగ్గర దీపం వెలిగించి పూజించడం ఎంతో శుభం అదేవిధంగా ఇంట్లో నెయ్యితో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలను చేయాలి అలాగే శివ కేశవులు ఆలయాలలో కార్తీకదీపం వెలిగించి ప్రత్యేకంగా పూజించడం ఎంతో శుభప్రదం. కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసంతో శివ కేశవులను పూజించడం వల్ల సర్వసంపదలు కలుగుతాయి. అదేవిధంగా నేడు దీపదానం ఆహార దానం ఎంతో ముఖ్యమైనది. కార్తీక పౌర్ణమి రోజు ఈ పద్ధతులను అనుసరించి పూజ చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.