మహేష్ హీరోగా నటించిన చిత్రం `దూకుడు`. ఈ చిత్రంలో విలన్‌గా సోనూసూద్ నటించిన విషయం తెలిసిందే. తనకు తమ్ముడిగా బంటీ పాత్రలో నటించిన నటుడే అజాజ్ ఖాన్. ఫేస్ బుక్ లైవ్‌లో మత విద్వేషాలు రెచ్చకొట్టేలా మాట్లాడాడని అతన్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్‌కి తరలించారు. అయితే తాజాగా అతనికి రిలీఫ్ లభించింది.
ముంబై బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టు లక్ష పూజీకత్తుతో శుక్రవారం బెయిల్‌ని మంజూరు చేసింది. ఏప్రిల్ 18న విద్వేష పూరిత ప్రసంగం, పరువు నష్టం, నిషేధ ఉత్తర్వుల ఉల్లంఘన కింద అజాజ్ ఖాన్‌పై ముంబై సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. `చీమ ,నిపోయినా ముస్లీంలదే బాధ్యత, ఒక ఏనుగు చనిపోయినా ముస్లీంలదే బాధ్యత. ఢిల్లీలో భూకంపం వచ్చినా ముస్లీంలదే బాధ్యత అంటారు. దేశంలో ఏ సంఘటన జరిగినా ముస్లీంలమీదే అభాండం వేస్తారు. ఆ కుట్రకు ఎవరు కారణమని ఎప్పుడైనా ఆలోచించారా? అని ఫేస్ బుక్ లైవ్‌లో అజాజ్ ఖాన్ ఫేస్బుక్ లైవ్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
పలు తెలుగు, హిందీ చిత్రాల్లో నటించిన అజాజ్‌పై గతంలో కూడా చాలా కేసులు నమోదయ్యాయి. ఓ బ్యూటీషియన్ని వేధించిన కేసుతో పాటు డ్రగ్స్ కేసులోనూ ఇజాజ్‌ఖాన్ ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం అనుభవించాడు.