మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌పై తమిళ సంఘాలు సీరియస్ అవుతున్నాయి. తమ ప్రాంత మనో భావాల్ని దెబ్బతీశాడని, తమని అవమానించడాని దుల్కర్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం `వరానే అవశ్యముండ్`. అనూప్ సత్యన్ దర్శకత్వం వహించాడు. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించింది. సురేష్ గోపీ, శోభన కీలక పాత్రల్లో నటించారు.
ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రంలో ముంబైకి చెందిన ఓ పాత్రికేయుడి ఫొటోని వాడుకుని అతన్ని అవమానించారని పెద్ద రచ్చే జరిగింది. దీనిపై సదరు పాత్రికేయుడు చిత్ర యూనిట్ై సీరియస్ కావడంతో దుల్కర్ సల్మాన్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో తమిళులని అవమానించే విధంగా ఓ సన్నివేశం డైలాగ్‌లు వున్నాయట. దీంతో తమిళ సంఘాలు దుల్కర్‌పై దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టాయి. వివాదం మరింతగా ముదరకముందే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని గ్రహించిన దుల్కర్ ట్విట్ఱ్ వేదిక తమిళులకు క్షమాపణలు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ విషయాన్ని చాలా మంది తన దృష్టికి తీసుకొచ్చారని, తమిళ ప్రజల్ని అవమానించాలని చేసిన సీన్ కాదని, అనుకోకుండా అలా జరిగిపోయిందని, మలయాళ సినిమా `పట్టణ ప్రవేశం`లోని సన్నివేశానికి ప్రేరణగానే ఆ సీన్ చేశామని, ఈ విషయంలో మీ మనోభావాల్ని కించపరిచి వుంటే క్షమించమని కోరుతున్నానని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు. ఈ సందర్భంగా `పట్టణ ప్రవేశం` చిత్రంలోని ఓ సీన్‌ని షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది.