సినిమా వాళ్ళ రిలేషన్స్ చాలా వింతగా ఉంటాయి. ఎప్పుడు ఎవర్ని కలుస్తారు ఎవరితో ప్రేమలో పడతారో ఎవ్వరికీ అర్ధం కాదు. ఇందులో హీరోహీరోయిన్లు మాత్రమే కాదు ఇందుకు దర్శక నిర్మాతలు కూడా మినహాయింపు ఏమీ లేదు. ఇక ఇదిలా ఉంటే ఓ స్టార్ డైరెక్టర్ మరో స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో డైరెక్టర్ గతంలో తన వల్ల తన పర్సనల్ లైఫ్‌కే ప్రాబ్లమ్ వచ్చిన హీరోయిన్ కు ఛాన్స్ ఇచ్చాడు. గతంలో ఆ హీరోయిన్ వల్ల పెళ్ళై ఏడాది కూడా కాపురం చెయ్యకుండానే ఆ దర్శకుడు అతని భార్యకు విడాకులు ఇచ్చాడు . ఆలాంటిది ఇప్పుడు సేమ్ అదే హీరోయిన్‌కి తిరిగి తన సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు.
దీంతో అంటే వీరిద్దరూ కలిసే ఉన్నారా. ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్‌కి అంతలాగా కనెక్ట్ అయిపోయాడా అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. హీరో మంచు విష్ణుతో కలిసి చేసిన చిత్రమే ఆఖరిగా నటించింది. అదే ఆమెకు ఆఖరి చిత్రం అని చెప్పాలి. ప్రస్తుతం ఎందులోనూ చెయ్యడం లేదు. ఈ మధ్య కాలంలో ఆ భామకి పెద్దగా సినిమాలు లేకపోయినప్పటికీ ఆ దర్శకుడు ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. దీంతో చాలా మంది ఆమెను పర్మనెంట్‌గా ఉంచేసుకున్నాడా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.
మరి దీనిని బట్టి ఈ విషయాన్ని అప్పట్లో గాసిప్‌గా తీసుకున్నా ఇప్పుడు ఈయనగారు ఇచ్చే ఛాన్స్‌తో కన్ఫర్మ్ అవుతున్నారు చాలా మంది. పైగా తనకు ఈ మధ్య సినిమాలు లేక అవుట్ డేటెడ్ హీరోయిన్గా ఉన్న ఆమెకు ఏకంగా ఓ పెద్ద స్టార్ హీరోతోనే ఛాన్స్ ఇచ్చేశాడు ఆ దర్శకుడు మరి ఇందుకు కన్ఫర్మ్ అవ్వక ఏమవుతారు ఇంక. ఏది ఏమైనప్పటికీ పెళ్ళి, భార్య భర్తల బంధానికి మన దేశంలో ఎంతో మంచి విలువుంది. అలాంటి సంస్కృతిని కూడా పక్కన పెడుతున్నారు కొందరు సెలబ్రెటీలు.