`అల‌వైకుంఠ‌పురంలో` ఓవ‌ర్సీస్ టాక్

HBD Megastar Chiranjeevi Allu Arjun

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రాబోతున్న మూడ‌వ చిత్రం కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు భారీగానే నెల‌కొన్నాయ‌ని చెప్పాలి. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలవుతుంది. సోష‌ల్ మీడియాలో అప్పుడే రివ్యూల సంద‌డి మొద‌లైంది.

ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్ లు కొంత‌మంది సినిమాని చూడడం జ‌రిగింది. దీంతో అక్కడ నుండి సినిమా టాక్ బయటకి వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో త్రివిక్రమ్ మార్క్ ఎలివేషన్ సీన్స్, ఆయ‌న స్టైల్లో ఉండే సీన్లు. అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజన్స్, అలాగే ఆయ‌న డాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకి బాగా హైలైట్ గా నిలిచాయ‌ని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో హైలైట్ అని చెబుతున్నారు. అయితే ఈ మ‌ధ్య త‌మ‌న్ మ్యూజిక్ అందించిన చిత్రాల‌న్నీ దాదాపుగా హిట్ అనే చెప్పాలి.

అల్లు అర్జున్ మాస్ సీన్స్ పండించ‌డంలో దిట్ట అనే చెప్పాలి. అయితే అవి ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ లో ఓ రేంజ్ లో ఉంటాయని.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి మరో హైలెట్‌గా నిలుస్తుంద‌ని అన్నారు. పండగ కానుకగా రాబోతున్న ఈ సినిమా బన్నీ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మ‌రికొద్ది గంట‌ల్లోప‌డే స్పెష‌ల్ షోస్ ద్వారా అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ చిత్రం హిట్ కావాల‌ని ఫ్రెండ్స్ చాలా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఏమాత్రం సినిమా కాస్త అటూ ఇటూ అయినా చాలా గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి నిరాశే మిగిల్చిన వారు అవుతారు.