Gallery

Home Tollywood అమెరికాలో మిలియ‌న్ డాల‌ర్‌ క్ల‌బ్ తో జోరు

అమెరికాలో మిలియ‌న్ డాల‌ర్‌ క్ల‌బ్ తో జోరు

సంక్రాంతి పోటీ రంజుగా సాగుతోంది. ఒక‌దాని వెంట ఒక‌టిగా వ‌రుస‌గా సినిమాలు రిలీజ‌య్యాయి. ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతూ ఓపెనింగులు తెస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం ఓవ‌ర్సీస్ బాక్సాఫీస్ వ‌ద్ద ప్రీమియ‌ర్లు మొద‌టి రోజు వ‌సూళ్లు క‌లుపుకుని ఏకంగా వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో చేరింది. తొలి వీకెండ్ నాటికి ఈ చిత్రం రెండు మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

అలాగే ఈ ఆదివారం నాడు రిలీజైన అల వైకుంఠ‌పుర‌ములో ఓవ‌ర్సీస్ రిపోర్ట్ ప‌రిశీలిస్తే.. హాఫ్ మిలియ‌న్ మార్క్ ని చేరుకుని 600 కె డాల‌ర్లు వ‌సూలు చేసే దిశ‌గా సాగుతోంద‌ని ట్రేడ్ చెబుతోంది. ఇక తొలి వీకెండ్ ఈ చిత్రం 2 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏడాది కాలంగా ఓవ‌ర్సీస్ దిగాలుగా ఉంది. పాన్ ఇండియా సినిమాలే మెప్పించ‌లేక‌పోయాయి. అయితే ఈ సంక్రాంతి పుంజులు మాత్రం రంజుగానే వ‌సూళ్లు సాధిస్తుండ‌డం హుషారు పెంచుతోంది.

ఈ జోరు ఇలాగే సాగితే ఈ సంక్రాంతి మంచి రిజ‌ల్ట్ అందుకున్న‌ట్టే. ఇక అల వైకుంఠ‌పుర‌ములో.. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాల‌కు ఇంచుమించు ఒకే టాక్ వినిపించింది. మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. తెలుగు రాష్ట్రాల వ‌సూళ్ల లెక్క‌లు తేలాల్సి ఉందింకా.

- Advertisement -

Related Posts

‘మ్యాస్ట్రో’ ప్యాకప్… జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్న నితిన్!

కరోనా కారణంగా చిత్ర పరిశ్రమలో ఏర్పడిన ప్రతికూల వాతావరణంలో కూడా హీరో నితిన్ జెడ్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే చెక్, రంగ్ దే రెండు చిత్రాలు విడుదలచేసి, ఇప్పుడు...

చిరంజీవి సినిమా టైటిల్ తో కార్తికేయ కొత్త సినిమా..! పోస్టర్, టైటిల్ రిలీజ్

కార్తికేయ.. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కాసారిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. 2017లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టయింది. అప్పటినుంచీ కార్తికేయ హీరోగా వరుసగా సినిమాలు హిట్, ఫ్లాపులతో సంబంధం...

వయసు మళ్ళిన హీరోయిన్ కూడ బాలకృష్ణ సినిమాకు నో చెప్పిందా ?

మన సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే.  అందునా బాలకృష్ణ చిత్రాలకు కథానాయికలు దొరకడం ఇంకా క్లిష్టమైంది.  'అఖండ' చిత్రానికి హీరోయిన్ ను తీసుకురావడానికి ఆ చిత్ర దర్శకుడు బోయపాటి...

Latest News