ఆకాష్‌కుమార్ హీరోగా మిస్టీ చక్రవర్తి హీరోయిన్‌గా యన్.నరసింహారావు దర్శకత్వంలో ఎకెఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించి న చిత్రం ‘శరభ’. డా.జయప్రద, నాజర్, నెపోలియన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయ్యింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ ,గ్రాఫిక్స్ పనిలో ఉన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. గ్రాఫిక్స్ మాత్రమే హైలెట్ గా అనిపించే ఈ చిత్రం క్షుద్రశక్తికి, దైవ శక్తికి మధ్య పోరాటంగా తెరకెక్కింది. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా ..అసలు కథేంటో చూద్దాం…
కథేంటంటే..
సింగాపుర గ్రామంలో మొదలయ్యే ఈ కథలో …. చంద్రక్ష ( పునీత్ ఇస్సేర్ ) అనే క్షుద్ర మాంత్రికుడు అతీతమైన శక్తులను కోసం నరబలులు ఇస్తూంటాడు. ఆ బలులు కూడా అమ్మాయిలనే ఎంచుకుంటాడు. అప్పటికే 17 మందిని బలి వేసేసాడు. ఇంకో అమ్మాయి దొరికితే తను అనుకున్నది సాధిస్తాడు. అందుకోసం దివ్య ( మిస్త్రీ చక్రబోర్తి ) ని ఎందుకుని, ఆమెన చంపాలనుకుంటాడు. అయితే ఈ దుష్టశక్తికి అడ్డుపడే ఓ దేవశక్తి శరభ (ఆకాష్ కుమార్) పుట్టి ఉందని అతనికి తెలియదు. అలాగే శరభకు నరసింహస్వామి అండగా ఉన్నాడని అసలు తెలియదు. ఈ లోగా దివ్యతో శరభ ప్రేమలో పడతాడు. ఆమెను క్షుద్రమాంత్రికుడు ఎత్తుకుపోతున్నడని తెలిసి..ఎలా అడ్డుపడ్డాడనేది మిగతా కథ.
ఎనాలసిస్
సినిమా ప్రారంభం ఎంతో ఇంట్రస్టింగ్ గా మొదలై ఆ తర్వాత మెల్లిగా డ్రాప్ అవటం మొదలవుతుంది. ముఖ్యంగా గ్రిప్పింగ్ గా లేని స్క్రీన్ ప్లే ఈ సినిమాని దెబ్బ తీసింది. థ్రిల్లర్ జోనర్ లో నడిచే ఈ సినిమా అంతగా థ్రిల్ గా అనిపించదు. దర్శకుడు విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పై పెట్టిన శ్రద్ద కథ,కథనాల మీద పెట్టలేదనిపిస్తుంది. అలాగే హీరో,హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా వీక్ గా ఉంది. హీరోగా ఆకాశ్ కుమర్ తొలి సినిమా కావటంతో ఎక్సప్రెషన్స్ వంటి విషయాల్లో చాలా వీక్ గా ఉన్నాడు. యాక్షన్ సీన్స్ మాత్రం బాగా చేసాడు. దర్శకుడు నరసింహరావు…తన సీనియారిటీతో కొత్త దర్శకుడులా ఎక్కడా అనిపించలేదు కానీ కొత్తదనం కూడా ఎక్కడా చూపలేకపోయాడు. రొటీన్ మేకింగ్ తో వెళ్లిపోయారు.
సాంకేతికంగా ..
ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు.. ఆర్ట్ డిపార్టమెంట్ కిరణ్ కుమార్ మన్నె , కోటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రమణ సాల్వ కెమెరా పనితనం. ఇక బుర్రా సాయిమాధవ్ మాటలు అనగానే చాలా ఎక్సపెక్ట్ చేస్తాం..ఆ స్టాండర్డ్స్ ఏవీ కనపడలేదు. తన కుమారుడే హీరోకావటంతో నిర్మాణం పరంగా ఏ లోటు లేకుండా చూసుకున్నారు నిర్మాత అశ్వని కుమార్ సహదేవ్.
చివరకు ఏంటి
సినిమా చూస్తూంటే ఏదో కన్నడ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. కానీ తెలుగు సినిమా చూస్తున్నట్లు అనిపించలేదు. ఈ మధ్యకాలంలో మాంత్రికుడు, మంత్ర శక్తులు వంటి వాటితో సినిమాలు రావటం లేదు అని లోటు ఫీలయ్యే వారు ఈ సినిమా చూడవచ్చు.
నటీనటులు: ఆకాశ్ కుమార్, మిస్తీ చక్రవర్తి, జయప్రద, నెపోలియన్, నాజర్, పునీత్, తనికెళ్ల భరణి, చరణ్ దీప్ తదితరులు
మాటలు: సాయి మాధవ్ బుర్రా
పాటలు: వేద వ్యాస్, రామ జోగయ్య శాస్త్రి, శ్రీమణి, అనంత శ్రీరామ్
కళ: కిరణ్ కుమార్ మన్నె
పోరాటాలు: రామ్- లక్ష్మణ్
ఛాయాగ్రహణం: రమణ సాల్వ
కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం: కోటి
నిర్మాత: అశ్వని కుమార్ సహదే
రచన-దర్శకత్వం: నరసింహ రావు
సంస్థ: ఎ.కె.ఎస్ ఎంటర్‌టైన్మెంట్
విడుదల: 22-11-2018