టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ మధ్య కాలంలో సక్సెస్ రేట్ తగ్గిందనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లలో వందల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించలేదు. ఈ ఏడాది విడుదలైన సినిమాలను పరిశీలిస్తే స్టార్ హీరోల సినిమాలు సక్సెస్ సాధిస్తే మిడిల్ రేంజ్ హీరోల, యంగ్ హీరోల సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలవడం గమనార్హం. 2022 సంవత్సరం జనవరిలో చిన్న సినిమాలు ఎక్కువగా విడుదలయ్యాయి.
జనవరి ఫస్ట్ వీక్ లో ఆశ ఎన్ కౌంటర్, ఇందువదన, 1945, అతిధి దేవోభవ సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. సంక్రాంతి పండుగ కానుకగా హీరో, రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి, బంగార్రాజు విడుదల కాగా బంగార్రాజు మాత్రం బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను అందుకుంది. జనవరి లాస్ట్ వీక్ లో గుడ్ లక్ సఖి రిలీజ్ కాగా ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
ఫిబ్రవరిలో సెహరి, ఖిలాడీ, సన్నాఫ్ ఇండియా, డీజే టిల్లు, భీమ్లా నాయక్ రిలీజ్ కాగా భీమ్లా నాయక్, డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మార్చి నెలలో స్టాండప్ రాహుల్, ఆడాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాగా ఆర్ఆర్ఆర్ మాత్రమే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఏప్రిల్ లో మిషన్ ఇంపాజిబుల్, గని, ఆచార్య రిలీజ్ కాగా ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. డబ్బింగ్ మూవీ అయిన కేజీఎఫ్2 మాత్రం స్ట్రెయిట్ సినిమాలకు సమానంగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
మే నెల మొదటివారంలో అశోకవనంలో అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయితీ, భళా తందనాన సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలలో అశోకవనంలో అర్జున కళ్యాణం మాత్రమే హిట్ గా నిలిచింది. మే రెండో వారంలో సర్కారు వారి పాట మే నాలుగో వారంలో ఎఫ్3 రిలీజ్ కాగా ఈ సినిమాలు కూడా సక్సెస్ ను అందుకున్నాయి. రాజశేఖర్ శేఖర్ మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. జూన్ నెలలో రిలీజైన సినిమాలలో మేజర్, డబ్బింగ్ మూవీ విక్రమ్ మినహా మరే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.