Bheemla Nayak: పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్‌ పై రివ్యూ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్….!

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన భీమ్లానాయక్‌ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోని థియేటర్లు పవన్ కళ్యాణ్ గర్జనకు అభిమానులకు పూనకాలు వస్తున్నాయని చెప్పవచ్చు. ఇలా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా సునామీ సృష్టిస్తోంది.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం ఈ సినిమాపై స్పందించి ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ చాలా రోజుల తర్వాత థియేటర్లో పవన్ కళ్యాణ్ గర్జన చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది అంటూ హరీష్ శంకర్ ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ బ్యాక్ బోన్ గా ఉందని, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన సాగర్ కే చంద్ర త్రివిక్రమ్ శ్రీనివాస్, సూర్యదేవర నాగ వంశీలకు కూడా హరీష్ శంకర్ అభినందనలు తెలియజేశారు.

ఇక ఈ సందర్భంగా హరీష్ శంకర్ తమన్ గురించి మాట్లాడుతూ….బావా… నీ కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ వర్క్‌. ప్రతి ఒక సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా అర్థం చేసుకున్న విధానం, అందుకు అనుగుణంగా మ్యూజిక్‌ ఇచ్చిన తీరు బాగుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ ఆఫ్‌ భీమ్లా..! అంటూ తమన్ సంగీతం పై హరీష్ శంకర్ ప్రశంసలు కురిపించారు. ఇక రానా డానియల్ శేఖర్ పాత్ర గురించి కూడా హరీష్ శంకర్ ఎంతో అద్భుతంగా వివరిస్తూ ట్వీట్ చేశారు.