Ram Charan: బాబాయ్ సినిమా ట్రైలర్ కు అబ్బాయ్ రివ్యూ..!

Ram Charan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ఫీవర్ టాలీవుడ్ లో ఎక్కువైంది. భీమ్లా నాయక్ ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ , టైటిల్ సాంగ్,ఆ తర్వాత రిలీజ్ అయినా రొమాంటిక్ సాంగ్ అన్ని యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి .ఫాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇక ఇన్ని వాయిదాల తర్వాత రిలీజ్ కి సిద్ధం అవుతున్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గట్టిగానే ప్లాన్ చేసారు.ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నాడని సమాచారం. ఇక ప్రీ రిలీజ్ కోసం ట్రైలర్ విడుదల చేసారు చిత్ర యూనిట్.

ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మధ్యలో వచ్చే పంచులు సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక నిత్యమీనన్ పాత్ర కూడా కీలకంగా ఉండడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ ట్రైలర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చేసాడు. భీమ్లా నాయక్ ట్రైలర్ ఎలక్ట్రీఫైయింగ్, పవన్ కళ్యాణ్ గారి ప్రతి యాక్షన్ అండ్ డైలాగ్స్ పవర్ ఫుల్. ఇక నా మిత్రుడు రానా పెర్ఫార్మన్స్ అండ్ ప్రెసెన్స్ టాప్ నోచ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ పై చెర్రీ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భీమ్లా నాయక్ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు డైరెక్టర్. మాటలు స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసారు. మలయాళం సినిమా అయ్యప్పమన్ కొషియమ్ సినిమా రీమేక్. అయితే కథలో చాలా మార్పులు చేసినట్టు సినిమా ప్రొడ్యూసర్ తెలిపారు.
భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న రిలీజ్ కానుండగా, మార్చి నెలలో భారీ బడ్జెట్ చిత్రాలను వరుసగా విడుదల కానున్నాయి. ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన RRR సినిమా మార్చి 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.