(చిత్రం : హనుమాన్, విడుదల : 12 జనవరి-2024, రేటింగ్ :3/5, నటినటులు : తేజ సజ్జ, వరలక్ష్మీ శరత్ కుమార్, అమృతా అయ్యర్, వినయ్ రాయ్ తదితరులు. దర్శకత్వం: ప్రశాంత్ వర్మ, నిర్మాత:నిరంజన్ రెడ్డి, సంగీతం:అనుదీప్ దేవ్, గౌరహరి, కృష్ణ సౌరభ్, సినిమాటోగ్రఫీ:దాశరథి శివేంద్ర)
‘హనుమాన్’ పేరు వింటేనే మనలో ఏదో అలజడి.. ఏదో ధైర్యం.. గత కొన్ని రోజులుగా సినీ ప్రేక్షకులతో పాటు, సోషల్ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న సినిమాఇది. ఈ సినిమా పేరు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తున్నదని చెప్పొచ్చు. వర్సటైల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన తొలి భారతీయ సూపర్ హీరో మూవీగా ‘హనుమాన్’ నేడు (12 జనవరి-2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి పోటీలను లెక్కచేయకుండా ధైర్యంగా థియేటర్లలోకి అడుగు పెట్టిన ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? ప్రేక్షకుల మనసులను గెలుచుకుందా? తెలిసుకుందాం.
కథ: అంజనాద్రి అని ఒక చిన్న పల్లెటూరు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఊరు ఇది. ఆ ఊరిలో అల్లరి, చిల్లరిగా తిరుగుతూ, చిన్న చిన్న దొంగతనాలు చేసే దొంగ హనుమంతు (తేజ సజ్జ)తో పాటు, అతనిని ప్రాణంగా చూసుకునే అక్క అంజమ్మ(వరలక్ష్మి శరత్ కుమార్). హీరో ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మీనాక్షి( అమృత అయ్యర్). అత్యంత బలహీనుడైన హనుమంతు.. మీనాక్షి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఆ ప్రమాదంలోనే హనుమంతుకి.. ఆ హనుమాన్ శక్తులు సిద్ధిస్తాయి. చిన్ననాటి నుండి సూపర్ హీరో అవ్వాలని తహతహలాడే మైఖెల్(వినయ్ రాయ్) ఈ విషయం తెలుసుకుని అంజనాద్రి గ్రామంలోకి ఎంటర్ అవుతాడు. అసలు హనుమంతుకి ఆ ప్రమాదంలో హనుమన్ శక్తులు ఎలా వచ్చాయి? అతడిని వెనుక ఉండి నడిపించిన శక్తి ఏమిటి? ఆ సూపర్ హీరో పవర్స్ కోసం ప్రయత్నించిన మైఖెల్ ఏమయ్యాడు? అసలు.. శ్రీరామ చంద్రమూర్తికి ఆ హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి? అన్నదే అసలైన కథ.
Read More : తేజనే ఆ సూపర్ హీరో
విశ్లేషణ: దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ చిత్రం కోసం ఏ విధంగా అయితే భారీ తారాగణాన్ని ఎంచుకోలేదో, ఆ కథ బ్యాక్ డ్రాప్ విషయంలో కూడా అంతే సాదాసీదాగా వెళ్ళిపోయాడు. టైటిల్స్ కార్డు సమయంలోనే సినిమా సోల్ పాయింట్ పాట రూపంలో చెప్పేయడంతో.. హీరో క్యారెక్టర్ ని, అంజనాద్రి గ్రామ స్థితిగతులను కళ్ళకు కట్టడానికి తీసుకున్న సమయం అంతగా ల్యాగ్ అనిపించదు. ఇక అక్కడ నుండి ఆలస్యం చేయకుండా హీరోకి సూపర్ పవర్స్ వచ్చేలా చూపించడం, దానికి ప్రేక్షకులు కూడా ఓకే అనిపించేలా సన్నివేశాలు ఉండడం.. అంతే ఇంట్రస్టుగా చక్కటి పాయింట్ తోవిశారన్తీ బ్యాంగ్ ముగించడం.. వీటన్నిటికీ తోడు ఒక ఆసక్తికరమైన లవ్ ట్రాక్ తో ఫస్ట్ ఆఫ్ అంతా ఆకట్టుకునేలా హాయిగా హాయిగా సినిమా ఆద్యంతం సాగి ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
భారతీయ సినిమా ప్రేక్షకులకి అంతగా పరిచయం లేని జానర్ సూపర్ హీరో మూవీస్. కానీ.., మన అందరికీ తెలిసిన రియల్ సూపర్ హీరో మాత్రం ఒకరున్నారు. ఆయనే మన \హనుమాన్’. ఆ అంజనీ సుతుడి బలం గురించి, శక్తి గురించి, ఆయన దైర్యం గురించి, ఆయన సాధించిన విజయాల గురించి వింటూ పెరిగిన వాళ్ళం మనం. అలాంటి ఓ మహా బలశాలి ఆరా చుట్టూ.. సూపర్ హీరో కాన్సెప్ట్ కథ అల్లుకోవడంతోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ సగం విజయాన్ని అందుకున్నాడు. నిజానికి మనం ఇప్పటి వరకు మార్వెల్ యూనివర్స్ లో చూస్తూ వచ్చిన స్పైడర్ మ్యాన్, ఐరెన్ మ్యాన్, యాంట్ మ్యాన్, హల్క్.. వీరంతా కూడా మన ‘హనుమాన్’ లోని ఒక్కో సూపర్ పవర్ ని మాత్రమే కలిగి ఉంటారు. అలాంటిది ఏకంగా ఆ హనుమానే సూపర్ హీరోగా కదిలొస్తే అనే ఆలోచన ప్రేక్షకులకి కిక్ ఇవ్వక ఇంకేం చేస్తుంది చెప్పండి?
హనుమాన్ సినిమా ఆద్యంతం ఆ సక్తికరంగా సాగి అందర్నీ విశేషంగా అలరించిందనై చెప్పొచ్చు. సూపర్ హీరో సినిమాలో ఓ బేసిక్ రూల్ ఉంటుంది. హీరోకి పవర్స్ వచ్చే వరకు ఎంతో సహనంతో కథతో ట్రావెల్ అయ్యే ప్రేక్షకులు ఒక్కసారి ఆ ఫేజ్ దాటాక కచ్చితంగా ఎక్స్ ట్రీమ్ ఎలిమెంట్స్ కోరుకుంటారు. అయితే.. దర్శకుడు ప్రశాంత్ వర్మ సరిగ్గా ఇక్కడే కాస్త తడబడ్డాడనిపించింది. హనుమంతుకి పవర్స్ వచ్చాక, ఆ పవర్ ఎక్కడ నుండి వస్తుందో మైఖెల్ కి అర్థం అయ్యాక కూడా కథ వేగం అందుకోవడంలో కొంత నిరాశనే కలిగించింది. పైగా.. ఆ సమయంలో అక్కడక్కడ వచ్చి పోయే లవ్ సీన్స్ ప్రేక్షకుడికి ఇంకాస్త భారంగా అనిపించాయి.
ఎప్పుడైతే సముద్రఖని క్యారెక్టర్ రివీల్ అవుతుందో అక్కడ నుండి హనుమాన్ అంచనాలు అందుకోలేని స్థాయికి వెళతాయి. ఇంత హైప్ ఇచ్చిన ప్రీ క్లైమ్యాక్స్ కి తగ్గట్టే.. క్లైమ్యాక్స్ మనసు, తనువు పులకించిపోయే రేంజ్ లో ఉండటంతో హనుమాన్.. సక్సెస్ ట్రాక్ ఎక్కేసిందనిపిస్తుంది. ఓ సామాన్య వ్యక్తికి అతీంద్రయ శక్తులు రావడం, వచ్చిన ఆ సూపర్ న్యాచురల్ పవర్స్‌తో విన్యాసాలు చేయడం అనే కాన్సెప్టులతో దాదాపుగా హాలీవుడ్‌లోనే ఎక్కువగా చిత్రాలు వస్తాయి. అందుకే అక్కడ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అంటూ ఇలా లెక్కలేనన్ని మ్యాన్‌లు తెరపైకి వచ్చాయి. అయితే వీటన్నంటికి మూలం మన పురాణేతిహాసాల్లోనే ఉంటుంది. మన పురాణాల్లో ఈ పాత్రలన్నీ ఉంటాయి. కానీ మన మేకర్లు మాత్రం అలాంటి కాన్సెప్టులతో సినిమా తీసేందుకు సాహసం చేయరు. అంతగా ఆలోచించరు. ఈ మధ్య అంటే మిన్నళ్ మురళీ అనే ఓ మలయాళీ చిత్రం వచ్చింది. అది మన ఇండియన్ సూపర్ హీరో సినిమా అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ అలాంటి కాన్సెప్టును ఎంచుకున్నాడు.
ఇలాంటి సూపర్ హీరో కథలు పిల్లలకు భలే ఎక్కేస్తుంటాయి. పిల్లల్ని ఆకట్టుకునేందుకు సూపర్ హీరో కాన్సెప్టులు అనేది మంచి ఉపాయం. ఈ సంక్రాంతికి పిల్లలకు హాలీడే. పిల్లలకు సాధారణంగానే హనుమంతుడు అంటే మహా ఇష్టంగా ఉంటుంది. అలాంటి ఆంజనేయుడి కాన్సెప్టు, హనుమాన్ సినిమా అంటే సహజంగానే పిల్లల మనసు పడుతుంది. సరిగ్గా పిల్లల మైండ్‌కు ఏం నచ్చుతుంది.. ఎలా తీస్తే పిల్లలకు ఎక్కుతుంది అనేది ప్రశాంత్ వర్మ పట్టేసుకున్నాడు. సినిమా ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కొంత సేపు అయ్యాక.. కాస్త డల్ అయినట్టుగా అనిపిస్తుంది. హన్మంతు పాత్రకు ఎప్పుడైతే సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయో సినిమా స్కోపే మారిపోతుంది. పిల్లలు ఆ సీన్లను భలే ఎంజాయ్ చేస్తారు. ఇక వీటికి తోడు సత్య, గెటప్ శ్రీనుల ఆహార్యం, కామెడీ కూడా పిల్లల్ని నవ్విస్తుంది. ప్రథమార్దం అంతా కూడా సరదా సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు సమస్య మొదలవుతుంది. సెకండాఫ్‌లో ఎలివేషన్ల సీన్లను లెక్కపెట్టలేం. ప్రతీ సీన్ ఎలివేషన్‌లా ఉంటుంది. కొండలాంటి బండను అవలీలగా ఎత్తే సీన్ అద్భుతంగా ఉంటుంది. చిన్న పిల్లలకు అలాంటి సీన్లే ఎక్కువగా ఎక్కేస్తుంటాయి. బుల్లెట్ల వర్షంతో వెనకాల శ్రీరాముని రూపం రావడం, ఆ సీన్‌లోని ఆర్ఆర్.. అన్నీ కలిపి దండంపెట్టేలా చేస్తాయి.
ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ మధ్యలో కాస్త సిస్టర్ సెంటిమెంట్‌ను కూడాపెట్టాడు. అయితే అక్కడ ఎమోషనల్ పాట వల్ల కాస్త స్లో అయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ పాట తరువాత వచ్చే సీక్వెన్స్, సముద్రఖని పాత్ర చెప్పే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. ఈ హనుమాన్ సినిమా నార్త్ ఆడియెన్స్‌కు బాగా ఎక్కేలా చేయడంలో సెకండాఫ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక చివర్లో ఆంజనేయుడి ఆగమనం అద్భుతంగా అనిపిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇంత అవుట్ పుట్ తీసుకొచ్చాడా? అని ఆశ్చర్యం వేస్తుంది.
ఆదిపురుష్ సినిమా అయితే హనుమాన్ ముందు తేలిపోయేట్టుంది. ఏ విషయంలోనూ చూసుకున్నా సరే హనుమాన్ అందనంత ఎత్తులో ఉంటుంది. టెక్నికల్‌గా ఈ చిత్రం హై స్టాండర్డ్‌లో ఉంది. విజువల్స్, ఆర్ఆర్ మతిపోగొట్టేలా ఉంటుంది. హనుమాన్ పాట, ఆర్ఆర్ వస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తేజ సజ్జానే ఈ పాత్రకు వంద శాతం కరెక్ట్. ప్రశాంత్ వర్మ ఎంతో ఆలోచించి, ఊహించి ఈ పాత్రకు తేజను ఎంచుకున్నట్టుగా అనిపిస్తుంది. తేజ సజ్జా లాంటి వాడికి సూపర్ పవర్స్ వస్తేనే పిల్లలు ఎంజాయ్ చేసేలా చూపించొచ్చు.. అదే కండలు తిరిగిన దేహం.. పెద్ద పెద్ద మీసాలు ఉన్న వాడికి సూపర్ పవర్స్ వస్తే.. అతను చేసే విన్యాసాలు కాస్త ఎబ్బెట్టుగా ఉండొచ్చు. అదే తేజ సజ్జాకు సూపర్ పవర్స్ వచ్చి.. విన్యాసాలు చేస్తూ.. విలన్లను చితక్కొడుతుంటే.. సినిమాలోని పిల్లలే కాదు.. తెర ముందు కూర్చున్న పిల్లలు కూడా చప్పట్లు కొట్టేస్తారు. అందుకే తేజ సజ్జాను ఈ పాత్రకు తీసుకున్నట్టుగా ఉన్నాడు. తేజ సైతం తెరపై సూపర్ హీరోలానే కనిపిస్తాడు. ఒక్కసారి ఆంజనేయుడి శక్తులు వచ్చాక.. ఎవరైనా కూడా సూపర్ హీరో అవ్వాల్సిందేగా. అలా తేజ సజ్జా హన్మంతు పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశాడు..
Read More: సుకుమార్ మల్టీ స్టారర్ ‘చరణ్ అర్జున్’.?
నటీనటుల ఎలా చేశారంటే… హనుమాన్ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. తేజ సజ్జ ప్రాణం పెట్టేశాడు అనడం కంటే జీవించేశాడు. ప్రతి ప్రేక్షకుడు ఆశ్చర్యపోయే రీతిలో తేజ తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రతీ సన్నివేశంలో మెరుగైన నటనను కనబరిచాడు. అందరి చేత మంచి మార్కులు రాబట్టుకున్నాడు. హనుమంతు పాత్రలో పరకాయ ప్రవేశం చేసేశాడు. ఇక అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ తన సహజ ధోరణీలో తన నటనతో ప్రేక్షకులు మెచ్చేలా మెరుపులు మెరిపించింది. అమృత అయ్యర్ క్యారెక్టర్ కి కథతో ప్రమేయం లేకున్నా, తనకి దొరికిన స్క్రీన్ స్పేస్ బాగానే వాడుకుంది. ఇక గెటప్ శ్రీను, సత్య, వెన్నల కిషోర్ వంటి వారు హనుమాన్ సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. సముద్రఖని. స్వామిజీ పాత్రలో కెరీర్ బెస్ట్ ఇచ్చేశాడు. సముద్రఖణి పాత్రలోని సస్పెన్స్ తెరపై చూస్తేనే కిక్కు. మీనాక్షిగా అమృతా అయ్యర్ అందంగా కనిపించింది. ఉన్నంతలో చక్కగా నటించింది. వరలక్ష్మీకి తన స్థాయికి తగ్గట్టుగా ఒకే సీన్ పడింది. వినయ్ రాయ్ విలనిజం మరింతగా చూపించాల్సిందేమో. పాలెగాడిగా కనిపించిన గజపతి భయపెట్టేశాడు. గెటప్ శ్రీను, సత్య, రోహిణి నవ్వించేశారు. వెన్నెల కిషోర్‌కు మంచి పాత్ర దక్కింది. ఇలా ప్రతీ ఒక్క పాత్ర మెప్పిస్తుంది.
సాంకేతికత విషయాలకొస్తే.. హనుమాన్ సినిమా కథ పరంగా ఎంత గొప్పగా ఉందో.. టెక్నీకల్ గా కూడా టీమ్ వర్క్ అంతే బాగా సెట్ అయ్యింది. ఈ విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది సిజీ వర్క్ గురించి. సినిమాలో ఎక్కడైతే హనుమాన్ రిఫరెన్స్ ఉందో.. ఆ షాట్స్ అన్నిట్లో బెస్ట్ సిజీ వర్క్ కనిపించింది. ఇదే హనుమాన్ సక్సెస్ కి పెద్ద ఎసెట్ అయింది. ఇక దాశరథి శివేంద్ర కెమెరా వర్క్ అన్ మ్యాచ్ బుల్. ప్రశాంత్ వర్మ విజన్ ని అందుకోవడంలో దాశరథి శివేంద్ర సూపర్ సక్సెస్ అయ్యారు. ఇక ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, గౌరహరి, కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందించారు. పాటలు ఓకే అనిపించుకోగా, బీజీఎమ్ మాత్రం సినిమాకి ప్రాణం పోసింది. ఇక దర్శకుడిగా ప్రశాంత్ వర్మ స్థాయి ‘హనుమాన్’ తో ఆకాశమంత పెరిగిందని చెప్పుకోవచ్చు. నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణ విలువలు బేషుగ్గా ఉన్నాయి.
HanuMan Movie Review – 3/5