తేజనే ఆ సూపర్ హీరో

Teja Sajja to is the Prasanth Varma's Hanu Man
Teja Sajja to is the Prasanth Varma's Hanu Man
 
చేసిన రెండు సినిమాలు ‘అ !, జాంబిరెడ్డి’లతో మెప్పించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ.  సినిమా సినిమాకు వైవిధ్యం చూపుతున్న ప్రశాంత్ వర్మ ఇంకో అడుగు ముందుకువేసి సూపర్ హీరో చిత్రాన్ని అనౌన్స్ చేశారు.  హాలీవుడ్లో బాగా పాపులర్ అయిన సూపర్ హీరోస్ అందరూ క్రియేట్ చేసిన పాత్రలే.  కానీ మన భారతీయ పురాణాల్లోనే సూపర్ హీరోస్ చాలామంది ఉన్నారు. వారిలో ప్రప్రథముడు హనుమంతుడు.  ఈ ఇతివృత్తంతోనే ‘హను మాన్’ పేరుతో సూపర్ హీరో కథ రాసుకున్నాడు ప్రశాంత్ వర్మ.  ఇందులో హీరో ఎవరు అనేది ఇన్ని రోజులు రహస్యంగా ఉంచి ఈరోజే రివీల్ చేశారు. 
 
అతను ఎవరో కాదు తేజ్ సజ్జ.  చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఎదిగి హీరోగా ఇప్పుడిప్పుడే అగులు వేస్తున్నాడు.  హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ‘జాంబిరెడ్డి’తో సక్సెస్ అందుకున్నాడు. దీంతో తేజకు హీరోగా ఆఫర్లు పెరిగాయి.  ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఈ ‘హను మాన్’ కూడ ఒకటి.  ఈ చిత్రంతో తేజ సజ్జ డిఫరెంట్ ఇమేజ్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. భిన్నమైన చిత్రాలు చేయలనుకునే వారికి మంచి ఆప్షన్ అవుతాడు కూడ.  తెలుగులో ఇదే మొదటి ఒరిజినల్ సూపర్ హీరో ఫిల్మ్.  జూలై నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.