మా నాన్న అంటే నాకు చాల ఇష్టం . మా నాన్న కోసం ఏమైనా చేస్తాను .. నాన్న మీద ప్రేమకి కొలమానం ఏముంటుంది .. అది ఎవరూ కొలవలేనంత … అది ఎవరు చూడలేనంత .. అది ఎవరికీ చెప్పలేనంత అద్భుతమైన విషయం … మా నాన్న కోసం ఖండాలు దాటాను , తన సంతోషం కోసం నా ఆనందాన్ని వద్దని అనగలను , తన కోసం అవసరమైతే ప్రాణం కూడా వదిలేస్తాను …కాదంటే ప్రాణం కూడా తీసేస్తాను … ఇది చెప్తే సరిపోతుందిగా …
మరి ఇది మానేసి , సినిమాలో అంత హింస ఎందుకో … పైగా మనీషాలాంటి స్వచ్ఛమైన ప్రేమ చూపించటం మానేసి , యానిమల్ లా ఎందుకు మారాలో… తెల్సుకోవాలంటే
యానిమల్ చిత్రం చూడాల్సిందే ..
కథ : వెతికితే దొరికిన కథ ఏంటంటే , తండ్రి పట్ల అమితమైన ప్రేమ ఉన్న కొడుకు ఆ తండ్రి ఆయుష్షు కోసం చేసిన మారణహోమం ..
రణబీర్ కపూర్ : చిత్రం లో ఇంకెవరైనా ఉన్నారా అన్నట్టు , మూడు గంటల నిడివిలో 3 గంటలు తానే కనిపిస్తూ సినిమా మొత్తం మోసేసాడు రణబీర్ కపూర్ .. తండ్రి పట్ల ప్రేమ, కోపం, బాధ, జాలి, దయ… భార్య పట్ల ప్రేమ, బాధ్యత , మోహం , భయం … శత్రువు పట్ల క్రోధం .. తోడబుట్టిన వారి పట్ల నమ్మకం .. ఒకటేమిటి అన్నింటిని అంత గొప్పగా చూపించే పాత్ర లో జీవించాడు ..
సందీప్ రెడ్డి వంగ : బాబీ డియోల్, కత్తితో నిన్ను నిన్ను అంటూ పిలిచినా విధానం చూసి కూడా చిత్రానికి మనం వెళ్ళటం మన తప్పు అన్నట్టు ఉంది అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ పనితనం యానిమల్ చిత్రంలో … అసలు ఏ భావోద్వేగం చూస్తున్న ప్రేక్షకుడు కనెక్ట్ అవలేదు .. అసలు తండ్రి కోసం వెన్నకి వచ్చిన కొడుకు తండ్రి కి ఏమి కావాలో అడగటం మానేసి యుద్ధం చేయాలనీ అనుకోవటం, ఆ యుద్ధం నాలుగు గోడల మధ్య అంత భారీగా ఎందుకు తీయాలో , అన్ని బుల్లెట్లు, తుపాకులు, ఎందుకు వాడాలో …అర్ధమే కాకుండా ఉంది … అనుమానం ఉంటే వారితో అంత దగ్గరగా ఎందుకుండాలో , ఆలా ఉంటేనే నిజం చెప్తారని ఎవరు చెప్పారో … ఏమి అర్ధం కాదు హీరో హీరోయిన్ మధ్య అసలు ఏముందో ఏమి అర్ధం కాదు , అది ప్రేమ, మోహమా , లేక ఇంకేదైనా తెలియలేదు …
కధలో ఎం చెప్పాలని ప్రయత్నించాడో అది పూర్తిగా చేరకుండానే చాల సేపు ప్రయాణం చేసినట్టు ఉంటుంది ప్రేక్షకుడికి .. దర్శకుడిగా సందీప్ ఫెయిల్ అయ్యాడని చెప్పాల్సిందే … ఇంకా ఎడిటర్ గా అయితే పూర్తిగా మర్చిపోవచ్చు … అసలు గంటకు పైన సినిమా కట్ చేసేయచ్చు అని ఎవరైనా చెప్తారు ..
మిగిలిన క్రాఫ్ట్స్ :
పాటలు సో సో .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు..
కెమెరా వర్క్ , మంచి విజువల్స్, అన్ని వృధాగా అనిపిస్తాయి …
అసలు విషయం :
చిత్రం లో కావాల్సిన తండ్రి కొడుకుల ప్రేమ , దానికున్న బలం , అసలు కనపడదు , పైగా ఆ కొడుక్కి తండ్రంటే ఎందుకంత ప్రేమ అనేది తెలీదు , డబ్బుతో కూడిన ఇగో తప్ప ఆ కొడుక్కి వేరే ఏది లేదన్నట్టు ఉంటుంది … తండ్రి వారసత్వం నిలబెట్టటం అంటే ఎవరిని లెక్క చేయకపోవటం అని ఎవరు చెప్పారో తెలీదు .. అలాగని పోనీ మొత్తం అందరిని లెక్కచేయడా అంటే అది కాదు , హీరోయిన్ ని ప్రేమిస్తాడు , దూరంగా ఉన్న అన్నాతమ్ములని ప్రేమిస్తాడు , కానీ బయట వారికీ మాత్రం విలువ లెన్నఁటే ఉంటాడు …
కరుడు కట్టిన కుటుంబ వాదం , రక్తపాతం , వికృతమైన హింస ఇవే యానిమల్ మొత్తం …
కొసమెరుపు ప్రశ్నలు :
1) హీరో కి ఎందుకు చెవుడు వస్తుంది , పక్కనోళ్లకి ఎందుకు రాదు ?
2) విలన్ ఎందుకు మూగవాడు ?
3) ఎందుకని 60 ఏళ్ళ ముసలోడిని చంపటానికి ఇంత హంగామా ?
4) అసలు రష్మిక మందన ఎందుకు వెళ్లిపోవాలని అనుకుంది చివర్లో ?
5) దర్శకుడు అసలు కథని ఏమని చెప్పి ఒప్పించాడు అనిల్ కపూర్ కి ?
ఎమోషన్ లేని , కనపడని , మనసుకు హత్తుకొని కథతో , అక్కర్లేని సెక్స్ ఎడ్యుకేషన్ , ఇగోయిజం , రోత కామెడీ , వెరసి యానిమల్ ని ప్రేమించలేని విధంగా మార్చేశాయి అని చెప్పటానికి చింతిస్తున్నాను , కానీ రణబీర్ కోసం …
రేటింగ్ ఇవ్వాలి కాబట్టి: 1/5
పవన్ దావులూరి