అక్టోబరులో తెలంగాణ యువత సత్తా చాటుతాం

 

తెలంగాణ రాజకీయ తెర మీద యూత్ కోసమే రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. యూత్, మహిళలకు ఈ పార్టీలో పెద్ద పీట వేస్తామని పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారు. పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీ ఆవశ్యకను వెల్లడించారు. ఆయన పార్టీ ప్రారంభోపన్యాసం చేశారు. ఆయన ఏమన్నారో చదవండి.

యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి

ఈ క్షణం నుంచి ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా యువ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుంది. తెలంగాణ యువత సత్తా ఏంటో నిరూపిస్తాం. అక్టోబరు నెలలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి యువ తెలంగాణ ఆశయాలు, లక్ష్యాలను జనాలకు వివరిస్తాం. పార్టీ పెట్టిన తర్వాత రాత్రికి రాత్రే అధికారంలోకి రావాలన్న ఆరాటం మాకేమీ లేదు. కాకపోతే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణ అసెంబ్లీలో యువ తెలంగాణ అడుగు పెట్టడం ఖాయం.

యువ తెలంగాణ జెండా ఆవిష్కరిస్తున్న పార్టీ నేతలు

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ భయాందోళనలో ఉంది. ప్రగతి నివేదన సభ అట్టర ప్లాఫ్ కావడంతో భయపడి రాత్రికి రాత్రి ఎన్నికలు ప్రకటించే పరిస్థితి ఉన్నది. సభ ఫెయిల్ కాగానే భయంతో వనికిపోతున్నారు గులాబీ నేతలు. కేసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, సేవ చేయాలనే లక్ష్యం ఉంటే మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నడా? చెప్పాలి. చేసిన ఏ హామీ కూడా అమలు చేయలేని దుస్థితిలో ఉన్నారు టిఆర్ఎస్ నేతలు. కాలు అడ్డం పెడితే నీళ్లొస్తాయని ఆనాడు అన్నాడు. కానీ ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో చెప్పాలి. మిగులు కరెంటు కేసిఆర్ గొప్పతనం ఏమీ కాదు. వేరే రాష్ట్రాల నుంచి కరెంటు కొనే దుస్థితి ఉంది.

యువ తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ రాణి రుద్రమ

మహిళలు, యువత ముందుకు రావాలి. యువత, మహిళలు ఒక్కటైతే ఈ ప్రభుత్వ పతనం తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోవడం దుర్మార్గం. మహిళలకు అపారమైన అవకాశాలు ఇవ్వడంలో భాగంగానే వర్కింగ్ ప్రసిడెంట్ గా రాణి రుద్రమను నియమిస్తున్నాము. రానున్న రోజుల్లో పార్టీ అజెండాను వివరిస్తాం. గ్రామస్థాయి మొదలుకొని, మండల స్థాయి, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తాం. అక్టోబరులో రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నాం.

యువ తెలంగాణ రాష్ట్ర కమిటీ 14 మందితో ఏర్పాటు చేశాము. కమిటీలో ఏడుగురు బిసిలు, ముగ్గురు ఓసి, ఇద్దరు ఎస్సీ, ఒక మైనార్టీ, ఒక ఎస్టీ కి అవకాశం ఇచ్చాము. అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చాము. ఈ క్షణం నుంచి ఏ ఎన్నిక జరిగినా మహిళలకు 40 శాతం సీట్లు ఇస్తాం.

వర్కింగ్ కమిటీ సభ్యుల లిస్టు కింద ఉంది చూడండి.

యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల జాబితా