దేశమంతా గ్రీన్ ఛాలెంజ్ హడావిడి జోరుగా సాగుతున్నది. టిఆర్ఎస్ ఎంపి కవిత షురూ చేసిన గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు తెలంగాణను దాటి దేశమంతా పాకింది. సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్లు కూడా గ్రీన్ ఛాలెంజ్ రిసీవ్ చేసుకుని మొక్కలు నాటారు. తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ హడావిడి మామూలుగా లేదు. పెద్ద వాళ్లంతా గ్రీన్ ఛాలెంజ్ లో మునిగిపోయారు.
గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కూడా మొక్కలు నాటారు. అయితే ఆమ్రపాలికి ఎవరూ గ్రీన్ ఛాలెంజ్ విసరలేదు. దీంతో ఆమె మామూలుగా అందరితో కలిసి మొక్కలు నాటారు. అంతేకాదు ఆమె కూడా ఎవరికీ గ్రీన్ ఛాలెంజ్ విసరలేదు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్, చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, స్టూడెంట్స్ తో కలిసి ఆమ్రపాలి మొక్కలు నాటారు. ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా ముందు వరుసలో ఉండే ఆమ్రపాలి గ్రీన్ ఛాలెంజ్ విషయంలో మాత్రం గతంలో మాదిరిగా హడావిడి చూపలేదు ఎందుకబ్బా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.