కేసీఆర్‌కు లక్ష కోట్ల డబ్బులిచ్చా..షాకిచ్చిన విజయశాంతి 

Vijayashanthi shocking comments on KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద యుద్ధం చేసే ప్రత్యర్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.  ఇన్నాళ్లు ప్రతిపక్షాల్లో ఉన్న అనేకమంది నేతలు  కేసీఆర్ మీద విమర్శలు చేసినా జనం పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి నేతలు విమర్శలు చేస్తే మాత్రం కొంత అటెంక్షన్ ఇచ్చేవారు.  కేసీఆర్ సైతం వీరి మాటలకు అప్పులుడప్పడు రియాక్ట్ అయ్యేవారు.  పేర్లు చెప్పకపోయినా పరోక్షంగా కౌంటర్లు వేసేవారు.  ఇప్పుడు ఆ లీడర్ల జాబితాలోకి విజయశాంతి కూడ చేరారు.   ఈమధ్యనే కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి వెళ్లిన ఆమె ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. బీజేపీ అధిష్టానం కూడఆమెకు ఫుల్ ఫ్రీడమ్  ఇచ్చేసింది.  కేసీఆర్ మీద ఏ లెవల్లో కావాలంటే ఆ లెవల్లో రేగిపొమ్మని వదిలేసింది.  

Vijayashanthi shocking comments on KCR

దీంతో విజయశాంతి ఇన్నాళ్లు తనలో ఉన్న అక్కసు మొత్తాన్ని ఒక్కసారిగా వెళ్లగక్కుతున్నారు.  కేసీఆర్ ఉద్యమానికి ద్రోహం  చేశారని,కుటుంబం కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం, త్యాగాలు చేసిన కుటుంబాల కోసం పనిచేయట్లేదని దుయ్యబడుతున్నారు.  అసలు కేసీఆర్ కు ఉదయం స్ఫూర్తి అనేదే లేదని తీసిపారేస్తున్నారు.  ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆమె మాటలు ప్రాథాన్యతను సంతరించుకుంటున్నాయి.  ఎందుకంటే విజయశాంతి గతంలో తెరాసతో కలిస్ పనిచేశారు.  మొదటి నుండి తెలంగాణ ఉద్యమానికి నిజాయితీగా  సపోర్ట్ చేస్తూ వచ్చారు.  ఏ పార్టీలో ఉన్నా ప్రత్యేక తెలంగాణ కోరుకున్నారు.  ఒకానొక దశలో ఇక ఈ పార్టీలతో పనికాదని సొంతగా తల్లి తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి చురుగ్గా పనిచేశారు.  

కానీ కొందరు ఉద్యమ పెద్దల మధ్యవర్తిత్వం, సలహాల కారణంగా ఆ పార్టీని తెరాసలో విలీనం చేసేశారు.  కేసీఆర్ తో కలిసి ఉద్యమంలో పనిచేశారు.  ఆ టైంలో ఆమె కేసీఆర్ ను అతి దగ్గరనుండి చూశారు.  అందుకే ఈరోజు ఆమె మాట్లాడే మాటలు జనం చెవిలో పడగలుగుతున్నాయి.  ఆమె కూడ డొంక తిరుగుడు వ్యవహారం లేకుండా కేసీఆర్ గురించి చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తున్నారు.  తాజాగా ఆమె ‘ఉద్యమ సమయంలో కేసీఆర్ వద్ద డబ్బు ఉండేది కాదు.  ఎవరు డబ్బులు ఇస్తారా అని ఆయన ఎదురుచూసే సమయంలో తాను పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాను.  ఆ డబ్బులో కూడ కొంత మొత్తాన్ని కేసీఆర్   తప్పుదోవ పట్టించారు. కానీ ఆ టైంలో ఉద్యమంలో ఉండటంతో నేను కూడ పట్టించుకోలేదు.  ఆ తర్వాత కేసీఆర్ కు డబ్బు మీద యావ ఎక్కువై ముఖ్యమంత్రి కాగానే దోచుకుంటున్నారు.  లేకపోతే ఉద్యమ సమయంలో పెద్దగా డబ్బు లేని కేసీర్ ఇప్పుడు లక్ష కోట్లు ఎలా వెనకేశారో చెప్పాలి’ అని అన్నారు.  ఈ మాటలు జనంలోకి బాగా వెళ్లాయి.  అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.  మరి వీటికి తెరాస నుండి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.