మోదీ, కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయశాంతి

సంగారెడ్డిలోని ఆర్సీ పురంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పాయి కానీ ఈవీఎంలను కేసీఆర్ ట్యాంపరింగ్ చేయించారని ఆరోపించారు. 

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ కు ఓ విజన్ ఉందని, ఓ ప్రణాళికతో పనిచేస్తారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె విమర్శలు చేశారు.

దేశంలో జీఎస్టీ వల్ల ఎవరికి లాభం ఉందని ప్రశ్నించారు. దేశాన్ని దోచుకుంటున్న పెద్దదొంగ మోదీ, తెలంగాణను దోచుకుంటున్న చిన్నదొంగ కేసీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.