కొడుకు విగ్రహం కూలగొడితే.. ఎగబడి కొట్టిన టిఆర్ఎస్ నేత (వీడియో)

ఆమె జిహెచ్ఎంసి పాలక మండలిలో అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు. కో ఆప్షన్ సభ్యురాలు. ఆమె పేరు గొట్టిముక్కల జ్యోతి గౌడ్. ఆమె కొడుకు గతంలో మరణించాడు. దీంతో కొడుకు మీదున్న ప్రేమతో కొడుకు విగ్రహాన్ని అల్వాల్ లో నెలకొల్పారు. ఆ విగ్రహాన్ని అనుమతి లేకుండా నెలకొల్పారని అల్వాల్ అల్వాల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారికి ఫిర్యాదు అందింది.

 

దీంతో ఆ విగ్రహాన్ని తొలగించారు టౌన్ ప్లానింగ్ అధికారులు. అనుమతి లేకుండా ఇందిరాగాంధీ విగ్రహం పక్కన జ్యోతిగౌడ్ కొడుకు విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆమె తెలిపారు. తాము స్పాట్ వద్దకు వెళ్లేసరికే విగ్రహం లేదని, దిమ్మె మాత్రమే ఉంటే దాన్ని తొలగించామని టౌన్ ప్లానింగ్ అధికారి మాధవి మీడియాకు చెప్పారు.

అయినప్పటికీ మాధవి వద్దకు తన అనుచరులను వెంటేసుకుని వచ్చిన జ్యోతి గౌడ్ సదరు అధికారి మీద చేయిచేసుకున్నారు. ఈ  ఘటనలో అధికారి చేతికి గాయమై రక్తం కారింది. అధికారి మీద దాడి జరగడంతో మున్సిపల్ అధికారులంతా డ్యూటీ మానేసి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. రాజకీయ నాయకుల దాడులు అరికట్టాలని, తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.  

 

 

16 ఏళ్ళ వయసులో ఉన్న తన కొడుకు అఖిల్ గత ఏడాది మరణించాడని జ్యోతి గౌడ్ తెలిపారు. అఖిల్ స్మారకార్థం స్థాపించిన విగ్రహాన్ని ఎందుకు తొలగించావ్ అని గొడవకు దిగి అధికారిపై దాడి చేశారు. 

తమ మీద జరిగిన దాడిపై టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్యోతి గౌడ్ దాడి చేసిన వీడియో, అధికారుల ఆందోళన వీడియో కూడా పైన, కింద ఉన్నాయి చూడండి.