తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస 2024 ఎన్నికల్లో అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటం తో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి చెక్ పెట్టే దిశగా టీఆర్ఎస్ అడుగులు వేస్తుండటం గమనార్హం. తెలంగాణ బీజేపీకి బిగ్ బాక్ ఇచ్చే దిశగా టీఆర్ఎస్ అడుగులు వేస్తుండటం గమనార్హం. బీజేపీ నేతలను టీఆర్ఎస్ టార్గెట్ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
అటు బీజేపీ ఇటు తెరాస దర్యాప్తు సంస్థల ద్వారా ఇతర పార్టీలను టార్గెట్ చేస్తున్నాయి. ఒక పార్టీ మరొక పార్టీని టార్గెట్ చేసుకోవడం ద్వారా రెండు పార్టీలు ప్రజల్లో చులకన అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ద్వారా బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. ఈ కేసు విషయంలో తెలంగాణ సర్కార్ దూకుడు పెంచడం చర్చనీయాంశమైంది.
సిట్ ద్వారా బీజేపీ నేతల పని పట్టాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. రెండు పార్టీలు ఒక పార్టి మరొక పార్టీని టార్గెట్ చేయడం ద్వారా వార్తల్లో నిలవాలని భావిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల అధికారులు ప్రధాన పార్టీల నేతల తీరుతో తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీని టార్గెట్ చేసినా తమ కెరీర్ కు నష్టం కలుగుతుందని నేతల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ పార్టీల కోసం దర్యాప్తు సంస్థలు పని చేయడం విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తెరాస వెళ్లే దారి కరెక్టేనా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రాజకీయాల్లో తెరాస రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సి ఉంది.