టిఆర్ఎస్ గువ్వల బాలరాజ్ నోట గలీజ్ కూతలు (వీడియో)

అచ్చంపేట టిఆర్ఎస్ అభ్యర్ది గువ్వల బాలరాజ్ మహిళను అసభ్య పదజాలంతో దూషించాడు. గువ్వల బాలరాజ్ ఓటేసేందుకు కొంత మంది మహిళలను తీసుకొని పోలింగ్ బూత్ కు వచ్చాడు. వారిని లైన్ లో కాకుండా బాలరాజ్ డైరెక్టు తీసుకురావడంతో ఓ మహిళ అడ్డు చెప్పింది. మేం చాలా సేపటి నుంచి ఉన్నాం అట్ల ఎట్ల వస్తరు  అంటూ ఆమె ప్రశ్నించింది. దీంతో గువ్వల బాలరాజ్ ఆ మహిళ పై తిట్ల పురాణం ఎత్తుకున్నాడు. గువ్వల బాలరాజ్ రెచ్చిపోయి ఏమన్నారంటే… 

“ఏమ్మా.. ఏం మాట్లాడుతున్నావు.. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం నాకు వచ్చే అవకాశం ఉంది. నువ్వు ఎవరు నన్ను ఆపడానికి.. ఎవనయ్య జాగీరు ఇది.. వాడు ఎవడు వంశీకృష్ణ.. వాన్ని దమ్ముంటే నా మీద గెలవమను లం….  చూస్తా.. వానమ్మ.. దేష్ట ముండ ఏం మాట్లాడుతున్నావు.. నీవు.. తమాషా చేస్తుర్రు. ఒక్కరోకరు. నేను దౌర్జన్యం చేసి ఓట్లు వేయించుకుంటున్నానా.. అవుల ముండా” అంటూ బాలరాజ్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంతలో పక్కకు ఉన్న మహిళలు, యువకులు ఎగబడడంతో గొడవ ముదిరేలా ఉందని నాయకులు, పోలీసులు బాలరాజ్ ని అక్కడి నుంచి తీసుకెళ్లారు.  గువ్వల బాలరాజ్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.