మహబూబ్‌నగర్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. శాలరీ, వయోపరిమితి, అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.
ఆఫీస్ స్టాఫ్ (జనరల్) ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
26, 27 తేదీలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నెలకు ఆఫీస్ స్టాఫ్‌కు 24,000 రూపాయల వేతనం లభించనుండగా ఫీల్డ్ స్టాఫ్‌కు రూ.36,000 వేతనం లభించనుంది. ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మహబూబ్‌నగర్ బ్రాంచ్ ఆఫీస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, మెట్టుగడ్డ, మహబూబ్‌నగర్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుండగా అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక జరిగే అవకాశం ఉంటుంది. అర్హత, ఆసక్తి ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.