బ్రహ్మంగారు చెప్పినట్టు ఈ లోకంలో అన్ని వింతలూ జరగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన సరోజకు శుక్రవారం ఉదయం మగ శిశువు జన్మించాడు. ఈ శిశువు కాళ్లు, చేతులకు ఆరు వేళ్లు ఉండడం గమనార్హం.
ఏదో ఒక చేతి లేదా కాలుకు ఆరు వేళ్లు రావడం చూశాం కానీ ఇలా రెండు కాళ్లు, రెండు చేతులకు ఆరు వేళ్లు రావడంతో అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. బాబు గురించి తెలుసుకున్న ప్రజలు ఆస్పత్రికి తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. జన్యుపరమైన లోపాల వల్లనే ఇలా పుడతారని, ప్రస్తుతం తల్లి, బిడ్డల ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.